Abhijeet Dipke | అమెరికాలో ఉన్నత చదువులు పూర్తి చేసి, అక్కడి సౌకర్యవంతమైన జీవితాన్ని వదిలి భారతదేశానికి తిరిగి వచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిపకే (Abhijeet Dipke) ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. నీట్ ఉద్యమంలో తనవంతూ పాత్ర పోషించి ఏకంగా కేంద్ర విద్యాశాఖ మంత్రినే గద్దె దించి మొదటి విజయం సాధించారు. అయితే అభిజిత్ ప్రస్తుతం ‘స్కూల్ థీక్ కరో’ (పాఠశాలను సరిదిద్దండి) అంటూ ఒక క్యాంపెయిన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. దీని లక్ష్యం ఏమిటంటే దేశంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు బాగుచేసి పిల్లలకు కనీస సౌకర్యాలు అయిన తాగునీరు, మరుగుదొడ్లు, కూర్చోవడానికి తగిన బెంచీలు అందజేయడం. అయితే ఇందులో భాగంగానే తన సొంత ఊరు అయిన మహారాష్ట్రలోని హింగోలి (Hingoli) జిల్లాలో ఈ క్యాంపెయిన్ ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమం అనంతరం ఎక్స్ వేదికగా స్పందించిన అభిజిత్ తాను అమెరికా వదిలి ఇండియా రావడానికి బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన కల్ట్ క్లాసిక్ సినిమా ‘స్వదేస్’ (Swades) కారణామని తెలిపాడు. ఆ సినిమా చూసే తాను భారత్‌కు తిరిగి రావాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు.
షారుఖ్ నటించిన స్వదేశ్ (Swades) సినిమా చూస్తూ పెరిగాను. ఆ సినిమా నా గుండెల్లోతుల్లోకి దిగిపోయింది. ఇప్పటివరకు దాన్ని 100 సార్లకు పైగా చూశాను అని ఆయన తెలిపారు. ఈ సినిమాలోని కొన్ని భావోద్వేగ సన్నివేశాలు తనను నిత్యం వెంటాడేవని ఆయన పేర్కొన్నారు. మోహన్ భార్గవ(షారుఖ్) పాత్ర హరిదాస్‌ను కలవడం, తన కుటుంబాన్ని పోషించడానికి పడుతున్న కష్టాన్ని చూడటం, అలాగే రైలులో ప్రయాణిస్తున్నప్పుడు బడికి వెళ్లాల్సిన చిన్నారి బాలుడు స్టేషన్లో నీళ్లు అమ్ముతుండటం చూసి మోహన్ కన్నీళ్లు పెట్టుకోవడం.. ఈ సన్నివేశాలు తనను ఎంతగానో కలిచివేశాయని చెప్పారు. ఆ సినిమా చూసిన ప్రతీసారి తాను కూడా కన్నీళ్లు పెట్టుకున్నానని, అప్పట్నుంచే తన గ్రామస్థుల కోసం ఏదైనా చేయాలనే బలమైన కోరిక తనలో ఉండిపోయిందని ఆయన భావోద్వేగంతో పంచుకున్నారు.
జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరని, ఇప్పుడు తాను అమెరికాను వదిలి వచ్చి తన స్వగ్రామం కోసం ‘స్వదేస్’ సినిమాలోని మోహన్ లాగే నిజమైన సేవ చేసే అవకాశం రావడం తన అదృష్టమని అభిజీత్ దిపకే ఆనందం వ్యక్తం చేశారు. ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణకు కృతజ్ఞతలు తెలుపుతూ, సమాజంలో సార్థకమైన మార్పు తీసుకురావడానికి తన సర్వశక్తులూ ఒడ్డుతానని ఆయన ప్రతిజ్ఞ చేశారు.
As Fatima bi said to Kaveri Amma: “Bata dena uss ladke ko apne hi paani mein pighal jaana barf ka muqaddar hota hai…”
Grew up watching Swades and fell so deeply in love with the film that I must have watched it over 100 times by now.
There’s one part that has always stayed… pic.twitter.com/d6MSD1BMAS
— Abhijeet Dipke (@abhijeet_dipke) August 15, 2026