గాలే: భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్టు(India vs Sri Lanka) ఆసక్తికరంగా మారింది. ధనంజయ డి సిల్వా, సోనల్ దినుషాలు ప్రస్తుతం పిచ్‌లో పాతుకుపోయ్యారు. ఆ ఇద్దరూ హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. 372 టార్గెట్‌తో నాలుగో రోజు బ్యాటింగ్ చేపట్టిన శ్రీలంక 4 వికెట్లు కోల్పోయిన 84 రన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ ఆఖరి రోజు కావడంతో.. మ్యాచ్ రసవత్తరంగా మారింది. ప్రస్తుతం అయిదో వికెట్‌కు ధనంజయ, దినుషాలు కీలక భాగస్వామ్యాన్ని అందించారు. ఆ ఇద్దరూ హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. విజయానికి భారత్‌కు ఆరు వికెట్లు అవసరం కాగా, శ్రీలంక బ్యాటర్లు మాత్రం లక్ష్యం దిశగా కదులుతున్నారు.
లంక కెప్టెన్ ధనంజయ టెస్టుల్లో 20వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 125 బంతుల్లో అతను అర్థశతకం బాదాడు. నాలుగో టెస్టు మ్యాచ్ ఆడుతున్న దినుషా.. 77 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఈ ఇద్దరి భాగస్వామ్యం.. మ్యాచ్ గమనాన్ని మార్చేసింది. తాజా సమాచారం ప్రకారం అయిదో వికెట్‌కు ఆ ఇద్దరి భాగస్వామ్యం 90 రన్స్ దాటింది. ఇక లంక 55 ఓవర్లలో 4 వికెట్లకు 142 రన్స్ చేసింది.