e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home News చ‌రిత్ర‌లో ఈరోజు : ఐదుగురిలో తొలిసారి ఎయిడ్స్ గుర్తింపు

చ‌రిత్ర‌లో ఈరోజు : ఐదుగురిలో తొలిసారి ఎయిడ్స్ గుర్తింపు

చ‌రిత్ర‌లో ఈరోజు : ఐదుగురిలో తొలిసారి ఎయిడ్స్ గుర్తింపు

ప్రాణాంత‌క‌మైన వ్యాధి ఎయిడ్స్‌తో ఐదుగురు వ్య‌క్తులు బాధ‌ప‌డుతున్న‌ట్లు తొలిసారిగా 1981 లో స‌రిగ్గా ఇదే రోజున నిర్ధార‌ణ చేశారు. ఇది జ‌రిగిన 18 ఏండ్ల‌కు ప్ర‌పంచంలో అత్య‌ధిక మ‌ర‌ణాల‌కు నాలుగో ప్ర‌ధాన కార‌ణంగా ఎయిడ్స్ అని గుర్తించారు. ఎయిడ్స్‌కు సంబంధించి సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ఒక కథనాన్ని మోర్బిడిటీ అండ్ మోర్టాలిటీ వీక్లీలో ప్రచురించింది. ఇందులో కొత్త రకం న్యుమోసిస్టిస్ న్యుమోనియా గురించి వివ‌రించారు. ఐదుగురు స్వలింగ సంపర్కుల్లో ఈ ర‌కం వ్యాధిని కనుగొన్నారు. వీరిలో రోగనిరోధక శక్తి అకస్మాత్తుగా తగ్గిపోయి కొన్ని నెలల తర్వాత ఐదుగురూ మరణించారు. అనంత‌రం శాస్త్రవేత్తలు ఈ వ్యాధికి ఎయిడ్స్ (అక్వైర్డ్ ఇమ్యూన్ డెఫిషియన్సీ సిండ్రోమ్) అని పేరు పెట్టారు.

వ్యాసం ప్రచురించిన కొద్ది రోజుల తర్వాత, అమెరికాలో ఇలాంటి అనేక కేసులు వెలుగులోకి వచ్చాయి. దర్యాప్తు చేయడానికి సీడీసీ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఇదే సంవత్సరం జూన్ నెల‌లో ఓ 35 ఏండ్ల‌ స్వలింగ సంపర్కుడిని చికిత్స కోసం ద‌వాఖాన‌లో చేర్చారు. ద‌వాఖాన‌లో చేరిన మొదటి ఎయిడ్స్ రోగిగా ఆయనను గుర్తించారు. ప్రారంభంలో ఈ వ్యాధి స్వలింగ సంపర్కుల్లో మాత్రమే క‌నిపించింది. తొలి ఏడాదిలో యునైటెడ్ స్టేట్స్ అంతటా 108 వ్యాధి కేసులు నమోదవ‌గా.. వాటిలో ఒకటి మాత్రమే స్త్రీ. కాగా, 1981 డిసెంబ‌ర్ 10 బాబీ కాంప్‌బెల్ అనే యువ‌కుడు తనకు తాను ఈ వ్యాధి బారిన పడినట్లు బహిరంగంగా ధ్రువీకరించాడు. ఈ వ్యాధితో పోరాడటానికి, ప్ర‌చారం నిర్వ‌హించేందుకు పోస్టర్ బాయ్ గా మారాడు. 1984 లో 32 సంవ‌త్స‌రాల వ‌య‌సులో మ‌ర‌ణించాడు.

ఈ వ్యాధి క్ర‌మంగా అంటువ్యాధి రూపంలోకి మార‌డంతో వైద్యులు, శాస్త్రవేత్తలతో పాటు ప్రజల్లో కూడా భయం మొద‌లైంది. దాంతో అవగాహన కార్యక్రమాలు చేప‌ట్ట‌డం, వ్యాధిపై పరిశోధన కోసం నిధులు ఇవ్వడం మొద‌లుపెట్టారు. 1983లో ఎయిడ్స్‌కు కారణమైన వైరన్‌ను క‌నుగొని.. దానిని గుర్తించేందుకు స్క్రీనింగ్ పరీక్ష‌ను కూడా సిద్ధం చేశారు. 1988 నుంచి ఏటా డిసెంబర్ 1 న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం జరుపుకుంటున్నాం. 1991 లో మొదటిసారి ఎరుపు రిబ్బన్‌ను ఎయిడ్స్ వ్యాధికి చిహ్నంగా ఉపయోగించారు.

మ‌రికొన్ని ముఖ్య సంఘ‌ట‌న‌లు..

నేడు ప్రపంచ పర్యావరణ దినం

2017: జీఎస్‌ఎల్‌వీ ఎమ్‌కే -3 రాకెట్ సహాయంతో జీశాట్ -19 ఉపగ్రహాన్ని ప్రయోగించిన భార‌త్‌

2015: అధిక స్థాయిలో సీసం దొరక‌డంతో భారత్ మాగీని నిషేధం విధింపు

1989: ‘త్రిశూల్’ క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన భార‌త్‌

1975: ఎనిమిదేండ్ల‌ తర్వాత సూయజ్ కాలువ ప్రారంభం

1924: అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా మొదటి ఫ్యాక్స్ పంపిన ఎర్నెస్ట్ అలెగ్జాండర్సన్

ఇవి కూడా చ‌ద‌వండి..

క‌రోనా టైం: స‌ప్లిమెంట్స్ న‌కిలీల‌ను ఇలా క‌నిపెట్టండి..!

లాక్‌డౌన్ ఎఫెక్ట్ : పిల్ల‌ల్లో పెరుగుతున్న ఊబ‌కాయం

కింగ్ కోబ్రా : శివాలిక్ కొండ‌ల్లో ద‌ర్శ‌నం

ఐఐటీయ‌న్ల ప్ర‌తిభ : అందుబాటులోకి హై ఫ్లో ఆక్సిజ‌న్ కాన్స‌న్‌ట్రేట‌ర్స్

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
చ‌రిత్ర‌లో ఈరోజు : ఐదుగురిలో తొలిసారి ఎయిడ్స్ గుర్తింపు

ట్రెండింగ్‌

Advertisement