కరోనా టైం: సప్లిమెంట్స్ నకిలీలను ఇలా కనిపెట్టండి..!
కరోనా కారణంగా సప్లిమెంట్లకు డిమాండ్ పెరగడం వల్ల నిజమైనవాటితోపాటు నకిలీ ఆరోగ్య పదార్ధాల మార్కెట్ కూడా వృద్ధి చెందుతున్నది. నిజమైన-నకిలీ సప్లిమెంట్లను గుర్తించడానికి కొన్ని సులభమైన మార్గాలను తెలుసుకుందాం

కరోనా మహమ్మారి ప్రజల్లో చాలా ఆరోగ్య స్పృహ తీసుకొచ్చింది. ఆరోగ్యంగా ఉండటానికి వ్యాయామం మొదలుకొని ఆహార పదార్ధాల వరకు.. ఆరోగ్యంగా తినడం, ఆనందంగా ఉండటం, ఆనారోగ్య అలవాట్లను దూరం చేసుకోవడం వంటి వివిధ చర్యలపై ప్రజలు ఇప్పుడు ఎక్కువగా శ్రద్ధ చూపిస్తున్నారు. తమతోపాటు తమవాళ్లు కూడా ఆరోగ్యంగా ఉండాలంటూ పెద్ద మొత్తంలో ఖర్చు చేసేందుకు వెనకాడటం లేదు.
ప్రస్తుతం మార్కెట్లో చాలా ఆరోగ్య పదార్ధాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో అసలైనవే కాకుండా నకిలీలు కూడా ఉన్నాయి. వీటిని గుర్తించడం కొంచెం కష్టంగానే ఉంటుంది. నిజమైన సప్లిమెంట్లుగా కనిపించే నకిలీ మందులలో తరచుగా స్టెరాయిడ్లు, హానికరమైన రసాయనాలు, నకిలీ పదార్థాలు వంటి నిషేధిత పదార్థాలు ఉంటాయి. ఈ రసాయనాలు శరీరానికి చాలా నష్టం కలిగిస్తాయి.
కరోనా కారణంగా సప్లిమెంట్లకు డిమాండ్ పెరగడం వల్ల నిజమైనవాటితోపాటు నకిలీ ఆరోగ్య పదార్ధాల మార్కెట్ కూడా వృద్ధి చెందుతున్నది. నిజమైన-నకిలీ సప్లిమెంట్లను గుర్తించడానికి కొన్ని సులభమైన మార్గాలను తెలుసుకుందాం.
బార్కోడ్ స్కానింగ్

ప్రస్తుత కాలంలో ప్రతి సంస్థ తమ ఉత్పత్తులకు బార్‌కోడింగ్ పద్ధతులను ప్రవేశపెడుతున్నాయి. ఆయా వస్తువులు నకిలీవా..? అసలువా..? తెలుసుకునేందుకు ఈ బార్ కోడ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రస్తుతం ఎన్నో బార్ కోడింగ్ యాప్ అందుబాటులోకి వచ్చాయి. వస్తువులపై ఉన్న బార్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా కంపెనీకి సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు. తద్వారా నకిలీ వస్తువులకు చెక్ పెట్టొచ్చు.
సీల్, ప్యాకేజింగ్ చాలా ముఖ్యం

ఆహార, వైద్య సంబంధ వస్తువులను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు కంపెనీలు పలు జాగ్రత్తలు తీసుకుంటాయి. వీటిలో ముఖ్యమైనది సీల్ అండ్ ప్యాకేజింగ్. ఈ రెండు సక్రమంగా ఉన్నాయంటే వీటిలో నకిలీలు కలుపలేదని మనకు తెలుస్తుంది. అందుకని సప్లిమెంట్లు కొనుగోలు చేసే ముందు ఆయా వస్తువుల సీల్, ప్యాకేజింగ్ సక్రమంగా ఉన్నదీ, లేనిదీ సరిచూసుకోవాలి. సీల్ చిరిగి ఉండటం, ప్యాకింగ్ లేకపోతే వాటిని కొనుగోలు చేయవద్దు. ఇవి నకిలీవిగా గుర్తుంచుకోవాలి.
ఎఫ్ఎస్ఎస్ఏఐ లోగో..

సప్లిమెంట్స్ ప్యాక్ చేసిన డబ్బాపై ఎఫ్ఎస్ఎస్ఏఐ లోగో తప్పనిసరిగా ఉండాల్సిందే. ఇది ఆహార సంబంధ వస్తువులు నిబంధనలు, సంరక్షణలకు లోబడి తయారు చేసినవిగా తెలుపుతుంది. ఈ లోగో లేని వస్తువుల జోలికెళ్లవద్దు. అవి మనకు ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. సప్లమెంట్స్ మనకు చేరేందుకు వీటిని రకరకాలుగా పరీక్షించి మనకు ఎంత మేర ఆరోగ్యాన్ని ఇస్తాయని ఈ సంస్థ తెలుపుతుంది. ఈ లోగో ఆహారా పదార్థాలకు శ్రీరామరక్ష వంటిదని గుర్తుంచుకోవాలి.
హోలోగ్రామ్‌తో నకిలీకి చెక్

ప్రసిద్ధ కంపెనీల ఉత్పత్తులకు మార్కెట్లో ఆదరణ రావడంతో వాటికి నకిలీలు తయారవుతుంటాయి. ఇలాంటి నకిలీలకు చెక్ పెట్టేందుకు చాలా కంపెనీలు తమ ఉత్పత్తులకు హోలోగ్రామ్ స్టిక్కర్లు వేస్తున్నాయి. ఆయా కంపెనీలు ఈ హోలోగ్రామ్ స్టిక్కర్లను ప్రచారం చేసుకుంటాయి. ఉత్పత్తులపై ఈ హాలోగ్రామ్ లను గుర్తించడం ద్వారా నకిలీలకు చెక్ పెట్టొచ్చు.
ఎంఆర్పీ స్టిక్కర్ గమనించాలి..

వస్తువుల లేబుల్‌పై అతికించే ఎంఆర్పీ స్టిక్కర్‌ను కూడా గమనించడం చాలా అవసరం. వీటిపై ఉండే తయారీ, గడువు తేదీలను పరిశీలించాలి. గడువు మీరిన వస్తువులను పక్కన పెట్టాలి. కొన్ని కంపెనీలు ఎంఆర్పీ స్టిక్కర్తోపాటు హాలోగ్రామ్‌ను కూడా ముద్రిస్తున్నాయి. వీటి ద్వారా నకిలీ సప్లిమెంట్లను గుర్తుపట్టవచ్చు.
నీటిలో వేస్తే దుర్వాసన..

అసలైన సప్లిమెంట్లను నకిలీలతో గుర్తించాలంటే వాటర్ టెస్ట్ చాలా ఈజీ. నీటిలో సప్లిమెంట్లను వేసి వీటి అధీకృతను తెలుసుకోవచ్చు. అసలైన సప్లిమెంట్లను నీటిలో వేసినా ఎలాంటి రంగుగానీ, రుచి గానీ మరదు. అదే నకిలీలు వేయగానే దుర్వాసన వేస్తుంది. అలాగే రంగులు మారడాన్ని గుర్తించవచ్చు.
ఇవి కూడా చదవండి..
పోస్ట్-కొవిడ్ ఫిట్నెస్ : నిత్యం 10 కి.మీ పరిగెత్తుతున్న మిలింద్ సోమన్
ముమ్మాటికీ బెట్టింగే : లూడోను లక్కీ గేమ్‌గా ప్రకటించాలని పిటిషన్
లాక్డౌన్ ఎఫెక్ట్ : పిల్లల్లో పెరుగుతున్న ఊబకాయం
కింగ్ కోబ్రా : శివాలిక్ కొండల్లో దర్శనం
ఐఐటీయన్ల ప్రతిభ : అందుబాటులోకి హై ఫ్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్
చైనా చరిత్రలో మరిచిపోలేని మరక.. చరిత్రలో ఈరోజు
వయసు పెరుగుదల : కొత్త ప్రోటీన్ కనిపెట్టిన ఇజ్రాయెల్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

