e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home News చైనా చ‌రిత్ర‌లో మ‌రిచిపోలేని మ‌ర‌క‌.. చరిత్ర‌లో ఈరోజు

చైనా చ‌రిత్ర‌లో మ‌రిచిపోలేని మ‌ర‌క‌.. చరిత్ర‌లో ఈరోజు

చైనా చ‌రిత్ర‌లో మ‌రిచిపోలేని మ‌ర‌క‌.. చరిత్ర‌లో ఈరోజు

చైనా ప్ర‌భుత్వ విధానాల‌కు నిరస‌న‌గా ప్ర‌జ‌లు చేప‌ట్టిన ఉద్య‌మంపై చైనా ఉక్కుపిడికిలి బిగించి 1989 లో స‌రిగ్గా ఇదే రోజున దాదాపు 10,000 మంది ప్రజాస్వామ్య అనుకూల నిరసనకారులను కాల్చివేసింది. చైనా రాజ‌ధాని న‌గ‌రంలోని తియాన్మెస్ స్క్వేర్ ఈ ఊచ‌కోత‌కు నిశ్శ‌బ్ధ సాక్షిగా నిలిచింది. ఆందోళ‌న చేస్తున్న వేలాది మంది నిరాయుధ ప్రజలపై ట్యాంకులతో చైనా సైన్యం విరుచుకుప‌డి దారుణానికి ఒడిగ‌ట్టింది. ప్ర‌జాస్వామ్య సంస్క‌ర‌ణ‌లు చేప‌ట్టాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరేందుకే వేలాది మంది తియాన్మెన్ స్క్వేర్‌లో ఆందోళ‌న చేప‌ట్టారు. ఈ ఘ‌ట‌న‌లో ఎంత మంది చ‌నిపోయింది అనే సంఖ్య‌ను ఆనాటి నుంచి నేటి వ‌ర‌కు ఏనాడూ చైనా వెల్ల‌డించ‌లేదు.

ఈ ఉద్యమం విద్యార్థి ఉద్యమంగా ప్రారంభమైంది. 80 వ దశకంలో చైనా పెద్ద మార్పులను తీసుకొచ్చింది. చైనా కమ్యూనిస్ట్ నాయకుడు డెంగ్ జియావోపింగ్ ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టారు. ఫ‌లితంగా విదేశీ పెట్టుబడులు పెరిగాయి. ప్రైవేట్ కంపెనీలు రావడం ప్రారంభించాయి. దాంతో చైనా ఆర్థిక వ్యవస్థ ఊపందుకుంది. అయితే, పెరుగుతున్న వేగంతో అభివృద్ధి, అవినీతి, ద్రవ్యోల్బణం, ఉపాధి లేకపోవడం వంటి సమస్యలు కూడా తెరపైకి వచ్చాయి.

వీటన్నింటికీ కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి హు యావోబాంగ్ మూల‌కార‌కుడ‌ని చైనా నాయకుడు డెంగ్ జియావోపింగ్ ఆరోపించారు. హు యావోబాంగ్ చైనాలో రాజకీయ సంస్కరణల కోసం వాదించారు. అయితే, అతను ఏప్రిల్‌లో అకస్మాత్తుగా మరణించాడు. ఇది వాతావరణాన్ని మరింత వేడి చేసింది. ఆయనకు నివాళి అర్పించడానికి వేలాది మంది బీజింగ్‌లోని తియాన్మెన్‌ స్క్వేర్‌లో గుమిగూడారు. పరిస్థితి అదుపు త‌ప్పిపోతుంద‌ని గ్ర‌హించిన చైనా ప్ర‌భుత్వం యుద్ధ చట్టాన్ని విధించి చాలా మందిని జైలులో పెట్టింది. సైన్యం రంగంలోకి దిగి తియాన్మెన్ స్క్వేర్‌ను త‌మ ఆధీనంలోకి తీసుకునేందుకు ట్యాంకుల‌తో కాల్పులు జ‌రిపింది. దాంతో దాదాపు 10 వేల మంది నిర‌స‌న‌కారులు ప్రాణాలు విడిచారు.

మ‌రికొన్ని ముఖ్య సంఘ‌ట‌న‌లు..

2010: ఫ్లోరిడా నుండి రాకెట్ ఫాల్కన్ -9 ను ప్రయోగించిన ఎలోన్ మస్క్ సంస్థ స్పేస్‌ఎక్స్

2008: అధ్యక్ష పదవికి డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిత్వాన్ని గెలుచుకున్న‌ బరాక్ ఒబామా

2005: 0పకిస్తాన్‌లో ప‌ర్య‌టించిన బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు ఎల్‌కే అద్వానీ

2001: నేపాల్ రాజుగా ప‌ట్టాభిషిక్తుయైన జ్ఞానేంద్ర

1973: ఏటీఎం కోసం పేటెంట్ పొందిన డాన్ వెట్జెల్, టామ్ బర్న్స్ , జార్జ్ చస్టెయిన్

1972: బంగ్లాదేశ్‌లో రెండు రైళ్లు ఢీ, 76 మంది దుర్మ‌ర‌ణం

1919: మ‌హిళ‌ల‌కు ఓటు హ‌క్కు క‌ల్పించేందుకు అమెరికా రాజ్యాంగంలోని 19 వ సవరణను సెనేట్ ఆమోదం

1917: మొదటి పులిట్జర్ బహుమతి ప్ర‌క‌ట‌న‌

1896: తాను రూపొందించిన మొట్టమొదటి ‘క్వాడ్రిసైకిల్’తో డెట్రాయిట్ వీధుల్లోకి వచ్చిన ఆటోమొబైల్ కంపెనీ ఫోర్డ్ యజమాని హెన్రీ ఫోర్డ్

ఇవి కూడా చ‌ద‌వండి..

మ‌రింత గౌర‌వం : వోగ్ ప‌త్రిక ముఖ‌చిత్రంపై మ‌లాలా

వ‌యసు పెరుగుద‌ల‌ : కొత్త ప్రోటీన్ క‌నిపెట్టిన‌ ఇజ్రాయెల్

ర్యాంకింగ్ విధానం : న్యూయార్క్ మేయ‌ర్ ఎన్నిక‌లో అమ‌లు

సోమ‌రిపోతు ఏనుగు.. నవ్వు తెప్పిస్తోంది..! వీడియో వైర‌ల్‌

ఈకో ఫ్రెండ్లీ ఫ్యూయ‌ల్ : 2023 ఏప్రిల్ నుంచి ఇథ‌నాల్ పెట్రోల్‌

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
చైనా చ‌రిత్ర‌లో మ‌రిచిపోలేని మ‌ర‌క‌.. చరిత్ర‌లో ఈరోజు

ట్రెండింగ్‌

Advertisement