వయసు పెరుగుదల : కొత్త ప్రోటీన్ కనిపెట్టిన ఇజ్రాయెల్
ఇజ్రాయెల్‌కు చెందిన శాస్త్రవేత్తలు అందుకు ఉపయోగపడే కొత్త ప్రోటీన్ కనిపెట్టారంటా. ప్రస్తుతం ఎలుకల్లో విజయవంతంగా పరీక్షిస్తున్నారని, త్వరలోనే మనుషులు, కోతుల్లో పరీక్షిస్తామని సెలవిస్తున్నారు ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు

జెరూసలెం : వయసును పెంచుకునే మార్గం ఉంటుందంటే అంతకన్నా ఆశ్చర్యం ఇంకొకటి ఉండదు కదూ..! అయితే, ఇజ్రాయెల్‌కు చెందిన శాస్త్రవేత్తలు అందుకు ఉపయోగపడే కొత్త ప్రోటీన్ కనిపెట్టారంటా. ప్రస్తుతం ఎలుకల్లో విజయవంతంగా పరీక్షిస్తున్నారని, త్వరలోనే మనుషులు, కోతుల్లో పరీక్షిస్తామని సెలవిస్తున్నారు ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు. ఈ ప్రోటీన్ అందుబాటులోకి వస్తే మానవులు తమ జీవితాన్ని 120 సంవత్సరాలు పొడిగించుకోవచ్చునంట. బార్-ఇలాన్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు.. మానవ శరీరంలో ఎస్‌ఐఆర్‌టీ-1 అనే ప్రోటీన్ మొత్తాన్ని పెంచడం ద్వారా జీవితాన్ని పొడిగించవచ్చునని సెలవిస్తున్నారు. ఈ ప్రోటీన్‌ను పెంచడానికి సహాయపడే అణువులను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం.
దీనికి సంబంధించి ఎలుకలపై చేసిన పరిశోధనలు విజయవంతమయ్యాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. తమ పరిశోధన సమయంలో ఎలుక జీవితం 23 శాతం పెరిగిందని వారు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మానవులు, కోతులపై ఈ పరిశోధనలు చేస్తామంటున్నారు. ఈ ప్రోటీన్ అందుబాటులోకి వస్తే ఒక వ్యక్తి జీవిత కాలం 120 సంవత్సరాలకు పెరుగుతుందని వారు భావిస్తున్నారు.
ఎస్‌ఐఆర్‌టీ-1 అనే ప్రోటీన్ క్యాన్సర్ నుంచి రక్షించడానికి కూడా పనిచేస్తుందని, పరిశోధనలు చేసేటప్పుడు ఎలుకలో దాని ఆయుర్దాయం పెరిగిందని పరిశోధకుడు హైమ్ కోహెన్ తెలిపారు. ఈ ప్రయోగం మగ, ఆడ ఎలుకలపై జరిగిందని, అయితే, మగ ఎలుకల వయస్సు ఎక్కువ పెరిగిందని, మగ ఎలుకల జీవితకాలం 30 శాతం, ఆడవారి జీవితకాలం 15 శాతం పెరిగిందని వెల్లడించారు. వృద్ధ ఎలుకల్లో వయస్సుతో పాటే శక్తి సాధారణంగా తగ్గుతుంది, కానీ, వాటి శరీరంలో ఈ ప్రోటీన్ పెరగడం వల్ల శక్తి కూడా పెరుగుతున్నట్లు గుర్తించినట్లు కోహెన్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ర్యాంకింగ్ విధానం : న్యూయార్క్ మేయర్ ఎన్నికలో అమలు
ఇజ్రాయెల్‌లో అధికార మార్పు: ప్రధానమంత్రిగా బెన్నెట్
సోమరిపోతు ఏనుగు.. నవ్వు తెప్పిస్తోంది..! వీడియో వైరల్
ఈకో ఫ్రెండ్లీ ఫ్యూయల్ : 2023 ఏప్రిల్ నుంచి ఇథనాల్ పెట్రోల్
ఫ్రెంచ్ ఓపెన్ : కరోనాతో డబుల్స్ ఆటగాళ్ళు అవుట్
సైకిల్ సవారీ-ఆరోగ్యానికి దారి.. నేడు వరల్డ్ సైకిల్ డే
భారత్ నుంచి పాకిస్తాన్ విభజన.. చరిత్రలో ఈరోజు
అంతరిక్ష కేంద్రంతో ఢీకొన్న శిధిలం.. రోబోటిక్ చేయికి నష్టం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

