లండన్ : ప్రముఖ బ్రిటిష్ పత్రిక వోగ్ తన ముఖచిత్రంపై మలాలా యూసుఫ్‌జాయ్‌ను చేర్చింది. ది ఎక్ట్సార్డినరీ లైఫ్ ఆఫ్ మలాలా.. సర్వైవర్, ఆక్టివిస్, లెజెండ్ అనే టైటిల్‌తో మలాలా ఘనకార్యాలను ప్రపంచానికి చాటిచెప్పింది. జూలై నెల సంచిక మలాలా కవర్ పేజీతో వెలువడనున్నది. వోగ్ పత్రిక తనను ముఖచిత్రంపై వేయడాన్ని మరింత గౌరవాన్ని కల్పించడంగా మలాలా అభిప్రాయపడింది.
మలాలా చరిత్రలో అతి పిన్న వయస్కురాలైన నోబెల్ బహుమతి గ్రహీత. కానీ అది ఆమె సాధించిన ఏకైక అంశం కాదు. ఆమె మనుసులో కదిలే జ్ఞాపకాలను వోగ్ పత్రిక ప్రచురించింది. బాలికలకు సురక్షితమైన విద్య కోసం ప్రచారం చేసేందుకు మలాలా సిద్ధమైంది. ఇందుకోసం ఒక నిధిని కూడా ప్రారంభించాలని ఆమె కోరుకుంటున్నది. తనను వోగ్ పత్రిక కవర్ పేజీగా వేసి ప్రత్యేక ఇంటర్వ్యూ రాయడాన్ని ఆమె ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
“ఒక యువతికి ఒక దృష్టి, ఒక లక్ష్యం ఉన్నప్పుడు ఆమె హృదయంలో మోసే శక్తి ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఈ కవర్‌పేజీని చూసే ప్రతి అమ్మాయి ప్రపంచాన్ని మార్చగలరని వారికి వారు తెలుసుకుంటారని నేను ఆశిస్తున్నాను” అని యూసుఫ్‌జాయ్ ట్విట్టర్లో పోస్ట్‌లో రాశారు.
వోగ్ పత్రిక ప్రకారం.. ఈ వీడియో ఇంటర్వ్యూ గురువారం నుంచి వారి ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లలో వీక్షించేందుకు అందుబాటులో ఉంటుంది. అంతర్జాతీయ మీడియాలో మలాలాకు ఇదే తొలి ఇంటర్వ్యూ కాదు. గతంలో చాలా పత్రికలు ఆమె ఇంటర్వ్యూలను ప్రచురించాయి. వోగ్ పత్రిక ముఖచిత్రంపై మలాలా ఉండటాన్ని పలువురు పాకిస్తాన్ నెటిజెన్లు తీవ్రంగా విమర్శించగా.. పాకిస్తాన్‌కు చెందిన పలువురు ప్రముఖులు ఆయేషా ఒమర్, మహీరా ఖాన్, షర్మీన్ ఒబైద్ చినాయ్, అలీ సేథి, మీషా షఫీ వంటి వారు ఆమె సాధించిన ఘనకార్యానికి ప్రశంసల్లో ముంచెత్తారు.
వయసు పెరుగుదల : కొత్త ప్రోటీన్ కనిపెట్టిన ఇజ్రాయెల్
ర్యాంకింగ్ విధానం : న్యూయార్క్ మేయర్ ఎన్నికలో అమలు
ఇజ్రాయెల్‌లో అధికార మార్పు: ప్రధానమంత్రిగా బెన్నెట్
సోమరిపోతు ఏనుగు.. నవ్వు తెప్పిస్తోంది..! వీడియో వైరల్
ఈకో ఫ్రెండ్లీ ఫ్యూయల్ : 2023 ఏప్రిల్ నుంచి ఇథనాల్ పెట్రోల్
ఫ్రెంచ్ ఓపెన్ : కరోనాతో డబుల్స్ ఆటగాళ్ళు అవుట్
సైకిల్ సవారీ-ఆరోగ్యానికి దారి.. నేడు వరల్డ్ సైకిల్ డే
భారత్ నుంచి పాకిస్తాన్ విభజన.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..