ముమ్మాటికీ బెట్టింగే : లూడోను లక్కీ గేమ్‌గా ప్రకటించాలని పిటిషన్
పిల్లలు మొదలుకొని పెద్దల వరకు ఆడుతున్న లూడో గేమ్‌ను లక్కీ గేమ్‌గా ప్రకటించాలని కోరుతూ బొంబాయి హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

ముంబై : పిల్లలు మొదలుకొని పెద్దల వరకు ఆడుతున్న లూడో గేమ్‌ను లక్కీ గేమ్‌గా ప్రకటించాలని కోరుతూ బొంబాయి హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టి ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలుపాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధికారి కేశవ్ ములే తరపున ఈ పిటిషన్ దాఖలైంది.
లూడో సుప్రీం యాప్‌లో ప్రజలు డబ్బు పెట్టి ఆడుతున్నారని పిటిషన్‌దారు పేర్కొన్నారు. పెద్ద మొత్తంలో బెట్టింగ్ పెట్టడం ద్వారా నలుగురు ఈ ఆట ఆడుతున్నారని, 20 రూపాయల గేమ్‌లో విజేతకు రూ.17, యాప్ నడుపుతున్న వ్యక్తికి రూ.3 లభిస్తుందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇది జూదం నిషేధ చట్టంలోని 3, 4, 5 సెక్షన్ల క్రింద వస్తున్నందున సదరు గేమ్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ ఎస్ఎస్ షిండే, హాలిడే కోర్టు జస్టిస్ అభయ్ అహుజా ధర్మాసనం విచారించింది.రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు నోటీసు జారీ చేసింది. పిటిషన్‌పై విచారణను జూన్ 20 కి వాయిదా వేశారు. అలాగే, లూడోను నైపుణ్యం కలిగిన ఆటగా భావించి ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి మేజిస్ట్రేట్ కోర్టు నిరాకరించింది. యువత పెద్ద సంఖ్యలో ఈ గేమ్ వైపు ఆకర్శితులవుతున్నారని, దీనికి అడిక్ట్ కాకముందే ఈ గేమ్‌ను లక్కీ గేమ్‌గా ప్రకటించి కఠిన చర్యలు తీసుకోవడానికి ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరమున్నదని పిటిషన్‌దారు కోర్టుకు విన్నవించారు.
ఇవి కూడా చదవండి..
లాక్డౌన్ ఎఫెక్ట్ : పిల్లల్లో పెరుగుతున్న ఊబకాయం
కింగ్ కోబ్రా : శివాలిక్ కొండల్లో దర్శనం
ఐఐటీయన్ల ప్రతిభ : అందుబాటులోకి హై ఫ్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్
చైనా చరిత్రలో మరిచిపోలేని మరక.. చరిత్రలో ఈరోజు
మరింత గౌరవం : వోగ్ పత్రిక ముఖచిత్రంపై మలాలా
వయసు పెరుగుదల : కొత్త ప్రోటీన్ కనిపెట్టిన ఇజ్రాయెల్
ఈకో ఫ్రెండ్లీ ఫ్యూయల్ : 2023 ఏప్రిల్ నుంచి ఇథనాల్ పెట్రోల్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

