పోస్ట్-కొవిడ్ ఫిట్నెస్ : నిత్యం 10 కి.మీ పరిగెత్తుతున్న మిలింద్ సోమన్
నా నుంచి కోలుకున్న తర్వాత నటుడు, మోడల్ అయిన మిలింద్ సోమన్ తొలిసారి 10 కిలోమీటర్లు పరిగెత్తారు. నిత్యం అర్ధగంటకు తక్కువ కాకుండా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలని ఆయన అభిమానులకు సూచించారు

ముంబై : కరోనా నుంచి కోలుకున్న తర్వాత నటుడు, మోడల్ అయిన మిలింద్ సోమన్ తొలిసారి 10 కిలోమీటర్లు పరిగెత్తారు. నిత్యం అర్ధగంటకు తక్కువ కాకుండా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలని ఆయన అభిమానులకు సూచించారు. సూర్యోదయం కన్నా ముందే లేచి రన్నింగ్ చేయడం చాలా మంచిదని ఆయన చెప్పారు. రోజూ 5-6 కి.మీ. రన్నింగ్ చేస్తున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలాగే, పూర్తి రన్నింగ్ షెడ్యూల్‌ను కూడా అభిమానులతో పంచుకున్నాడు. తొలిసారి 62 నిమిషాల్లో 10 కిలోమీటర్లు పరిగెత్తానని వెల్లడించాడు. ఈ సమయంలో హృదయ స్పందన 142 గా ఉన్నదని తెలిపారు.
మిలింద్ ఇచ్చిన పోస్ట్‌లో తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. వీటిని మిలింద్ ఫిట్నెస్ మంత్రంగా చూసి పాటించాలని కోరారు.
రన్నింగ్ కోసం ఐదు వేళ్ల వైబ్రామ్ ధరించాలి. ఇది బొటనవేలికి క్లిప్ చేయబడి ఉంటుంది. లేదంటే లూనా చెప్పులు వేసుకోవాలి.
మృదువు, కఠినమైన ఉపరితలాలు అనే పట్టింపు ఉండకూడదు. సజావుగా నడవడం ముఖ్యం.
క్రమం తప్పకుండా సజావుగా నడవడం అలవర్చుకోవాలి. ఇది కాళ్ళను బలపరుస్తుంది. పరిగెత్తడం మోకాళ్ళకు మంచిది.
వ్యాయామానికి కొత్త వ్యక్తులు, అధిక బరువు గల వారు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు తక్కువ దూరంతో రన్నింగ్ ప్రారంభించాలి. క్రమంగా దూరం పెంచుతూ పోవాలి.
నిత్యం 5-6 కిలోమీటర్లు పరిగెత్తుతున్నట్లయితే ప్రత్యేక ఆహారం అవసరం లేదు. ఇందుకు ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం ముఖ్యం.
ఉదయాన్నే సూర్యకిరణాలు మన శరీరంపై పడేలా రన్నింగ్ కానీ, వాకింగ్ కానీ ఉండాలి. దీంతో మనకు విటమిన్ డీ కూడా అందుతుంది. ఎండ ఎక్కువగా ఉంటే సన్‌స్క్రీన్‌కు బదులుగా ముఖానికి పెరుగు రాసుకుంటే సరిపోతుంది.
బయటకు వెళ్లి వ్యాయామం చేయడానికి ఇబ్బందిగా ఉంటే.. ఇంటి దాబాకు మించింది ఇంకోటి ఉండదు.
ఎవరైనా ఇన్ఫెక్షన్కు గురవుతారు. అయితే మీరు ఫిట్నెస్గా ఉంటే ఏ వైరస్ మిమ్మల్ని ఏమీ చేయదని గుర్తుంచుకోండి.
ఇవి కూడా చదవండి..
ముమ్మాటికీ బెట్టింగే : లూడోను లక్కీ గేమ్‌గా ప్రకటించాలని పిటిషన్
లాక్డౌన్ ఎఫెక్ట్ : పిల్లల్లో పెరుగుతున్న ఊబకాయం
కింగ్ కోబ్రా : శివాలిక్ కొండల్లో దర్శనం
ఐఐటీయన్ల ప్రతిభ : అందుబాటులోకి హై ఫ్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్
చైనా చరిత్రలో మరిచిపోలేని మరక.. చరిత్రలో ఈరోజు
మరింత గౌరవం : వోగ్ పత్రిక ముఖచిత్రంపై మలాలా
వయసు పెరుగుదల : కొత్త ప్రోటీన్ కనిపెట్టిన ఇజ్రాయెల్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

