GT vs RCB | యాభైతో గుజరాత్‌ను ఆదుకున్న సుందర్.. ఆర్సీబీని ఊరిస్తున్న రెండో ట్రోఫీ..!
GT vs RCB : ఐపీఎల్ 19వ సీజన్ ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ బ్యాటంగ్ యూనిట్ కుప్పకూలింది. వాషింగ్టన్ సుందర్(50 నాటౌట్) అర్ధ శతకంతో పోరాడాడు. అతడు చివరిదాకా నిలబడడంతో గుజరాత్ నిర్ణీత ఓవర్లలో155 పరుగులు చేయగలిగింది.
GT vs RCB : ఐపీఎల్ 19వ సీజన్ ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ బ్యాటంగ్ యూనిట్ కుప్పకూలింది. అహ్మదాబాద్‌లో ఆర్సీబీ పేసర్ల ధాటికి పవర్ ప్లేలోనే కెప్టెన్ శుభ్‌మన్ గిల్(10), సాయి సుదర్శన్(12)లు పెవిలియన్ చేరగా.. మిడిలార్డర్ చేతులెత్తేసింది. వ్యూహాత్మకంగా బ్యాక్ లెంగ్త్, బౌన్సర్లతో భువనేశ్వర్(2-29), రసిక్ దార్ సలాం(3-27) గుజరాత్ హిట్టర్లను కట్టడి చేయగా.. వాషింగ్టన్ సుందర్(50 నాటౌట్) అర్ధ శతకంతో పోరాడాడు. అతడు చివరిదాకా నిలబడడంతో గుజరాత్ నిర్ణీత ఓవర్లలో155 పరుగులు చేయగలిగింది.
సొంతమైదానంలో ఫైనల్.. భారీ స్కోర్‌తో ఆర్సీబీకి సవాల్ విసరాలనుకున్న గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ తడబడుతూ సాగింది. ఈ సీజన్లో ప్రత్యర్ధి బౌలర్లను ఉతికేసిన ఓపెనర్లు శుభ్‌మన్ గిల్(10), సాయి సుదర్శన్(12) ఆదిలోనే ఔటయ్యారు. జాకబ్ డఫ్ఫీ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో వరసగా రెండు ఫోర్లు బాదిన సుదర్శన్‌ను అంపైర్ ఔటిచ్చాడు. వెంటనే రివ్యూ కోరిన అతడు బంతి బ్యాట్‌కు తగలకపోవడంతో బతికిపోయాడు.
Innings Break!
Washington Sundar fights back but an all-round effort from #RCB restricts #GT to 1️⃣5️⃣5️⃣
Scorecard ▶️ https://t.co/Yz6K3q6w0X#TATAIPL | #Final | #TheFinalLeap | #RCBvGT pic.twitter.com/1nMfBYvg1D
— IndianPremierLeague (@IPL) May 31, 2026
క్వాలిఫయర్ 2లో శతకంతో మెరిసిన గిల్‌ను హేజిల్‌వుడ్ బోల్తా కొట్టించాడు. తొలి బంతికి బౌండరీ బాదిన గిల్.. రెండో బంతిని షాట్ ఆడాలనుకున్నా టైమింగ్ కుదరక గాల్లోకి లేవగా ఆర్సీబీ కెప్టెన్ పటిదార్ పరుగెత్తుతూ వచ్చి అందుకున్నాడు. దాంతో, 22 వద్ద గుజరాత్ తొలి వికెట్ పడింది.
How good has Rasikh Dar been this season? 🤌
Two impressive scalps to halt #GT ✌️
Updates ▶️ https://t.co/Yz6K3q6w0X#TATAIPL | #Final | #TheFinalLeap | #RCBvGT pic.twitter.com/FHzCg1UGSv
— IndianPremierLeague (@IPL) May 31, 2026
సుందర్ ఒక్కడే
ఆ తర్వాతి ఓవర్లోనే సుదర్శన్‌ను బౌన్సర్‌తో ఔట్ చేసిన భువనేశ్వర్ గుజరాత్‌ను గట్టిదెబ్బ కొట్టాడు. రసిక్ దార్ సలాం(3-27) ఓవర్లో పడిక్కల్ బౌండరీ క్యాచ్‌తో నిషాంత్ సింధు(20) వెనుదిరిగాడు. టాపార్డర్ విఫలమైన వేళ జోస్ బట్లర్(29), వాషింగ్టన్ సుందర్(50 నాటౌట్)లు గుజరాత్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టే బాధ్యత తీసుకున్నారు. డఫ్పీ బౌలింగ్‌లో సుందర్ గాల్లోకి లేపిన బంతిని కాక్స్ డైవ్ చేస్తూ అందుకున్నాడు. కానీ, చేతి వేళ్ల మధ్యలోంచి బంతి నేలకు తాకడంతో అంపైర్ నాటౌటిచ్చాడు. దాంతో, గుజరాత్ ఊపిరిపీల్చుకుంది.
Coming up clutch ✅
Washington Sundar with a fighting FIFTY 💪
Updates ▶️ https://t.co/Yz6K3q6w0X#TATAIPL | #Final | #TheFinalLeap | #RCBvGT pic.twitter.com/dwEHzKRMMO
— IndianPremierLeague (@IPL) May 31, 2026
కానీ, కృనాల్ పాండ్య ఓవర్లో ముందుకొచ్చి ఆడిన బట్లర్ స్టంపౌటయ్యాడు. ఆర్డర్లో ముందొచ్చిన అర్షద్ ఖాన్(15) రెండు సిక్సర్లు బాది వెనుదిరిగాడు. రాహుల్ తెవాటియా(7), హోల్డర్(7)లు ఇలా వచ్చి అలా వెళ్లగా.. చివరి ఓవర్లో తొలి బంతికి సిక్సర్ బాదిన రషీద్ ఖాన్(7).. ఆ తర్వాత బంతికే షెపర్డ్ చేతికి చిక్కాడు. 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేయగలిగింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

