ఉమ్మడి జిల్లాపై కరువు ఛాయలు కమ్ముకుంటున్నాయి. భూగర్భ జలాలు రోజురోజుకూ పాతాళానికి చేరుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో నెల వ్యవధిలోనే సగటున 1.23 మీటర్ల లోతుకు పడిపోయాయి. దాదాపు అంతటా ఇవే పరిస్థితులు కనిపిస్తు�
ముంచుకొస్తున్న కరువు మనుషులకే కాకుండా మూగ జీవాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. వానలు లేక, చెరువుల్లో నీరు లేక భూగర్భ జలాలు అడుగంటిపోయి తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. దీంతోపాటు మండిపోతున్న ఎండలతో ఎక్కడా పశువ
గతేడాది నీటితో కళకళలాడిన శాలిగౌరారం ప్రాజెక్టు నేడు నీళ్లు లేక వెలవెలబోతున్నది. గడిచిన పదేండ్లలో ఇంత గణనీయంగా నీటిమట్టం తగ్గిన దాఖలాలు లేవు. ప్రతియేటా ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండి వానకాలం, యాసంగి ప�
బీడువారిన పొలాలు...ఎండిన చెరువులు.. తెగిన చెరువు కట్టలు.. మరమ్మతులకు నోచుకోని చెరువులు.. చుక్కా నీరు పోయని బోర్లు.. ఇదంతా పదేండ్ల కిందట సమైక్యపాలనలోని దుస్థితి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత పదేం�
అన్నదాతల ఆశలు అడుగంటుతున్నాయి. సాగునీటి కష్టాలు తీవ్రమవుతున్నాయి. మొన్నటిదాకా బంగారు పంటలు పండించిన అనేక ప్రాంతాల్లో తండ్లాట మొదలైంది. ఎగువ నుంచి జలాలు రాక, చెరువులు, కుంటల భరోసా లేక ఎవుసం ఆగమైతున్నది.
జిల్లాలో కొన్నేళ్లుగా పెరుగుతూ వచ్చిన యాసంగి సాగు, ఈయేడాది తగ్గుముఖం పట్టింది. గతేడాది ఇదే సీజన్లో దాదాపు 43 వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలు వేయగా, ఈసారి 30 వేల ఎకరాల్లోపే సాగైనట్లు అధికారులు అంచనా వేస్తున్న
ఎలబోతారం గోసపడుతున్నది. నాడు పసిడి పంటలతో కళకళలాడిన ఆ పల్లె, ఇప్పుడు సాగునీటికి అల్లాడిపోతున్నది. ఇన్నాళ్లూ గ్రామానికి ఆదరువుగా ఉన్న ఊరచెరువు ఈ సారి భరోసా ఇవ్వకపోవడంతో వంద ఎకరాలను బీడు పెట్టాల్సి వచ్చి�
చాలాకాలం తర్వాత రంగారెడ్డి జిల్లాలో కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. ఒట్టిపోయిన నీటి వనరులు.. కరెంట్ కోతలు.. బీటలు వారుతున్న పొలాలు.. రైతాంగానికి పాత రోజులను గుర్తుకు తెస్తున్నాయి.
మండలంలోని పలు గ్రామాల్లో యాసంగిలో సాగు చేసిన వరిపై రైతులు ఆశలు వదిలేసుకుంటున్నారు. వానకాలంలో సన్న రకం వరి ధాన్యం క్వింటాల్ రూ.2,600 నుంచి రూ.3,200 పలుకడంతో రైతులు ఆశతో యాసంగిలో పెద్ద మొత్తంలో వరిసాగు వేశారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో 51 మేజర్ల ద్వారా ఎడమకాల్వ కింద వరి సాగు చేస్తారు. సాగర్ నుంచి నీటి విడుదల లేకపోవడంతో రైతులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లుగా బోరు బావులు, ఊట బావుల ద్వారా వరిసాగు చేశారు. ఈ యాసంగిలో స
యాసంగి సాగును నీటి కష్టాలు చుట్టుముట్టాయి. ఉత్తర తెలంగాణకు వరదాయినిగా ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువన కాకతీయ కాలువ కింద సాగు ప్రశ్నార్థకంగా మారింది.