సంస్థాగత మార్పులు, వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం వంటి అంశాలపై గురువారం శంషాబాద్‌లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా సమావేశం గందరగోళంగా సాగింది.
ప్యారానగర్ డంపింగ్‌యార్డును వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ చేపట్టిన రిలే నిరాహారదీక్షలు గురువారానికి 86వ రోజుకు చేరాయి.
అక్రమాలకు పాల్పడుతున్న మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తెలంగాణ రాష్ట్ర కంట్రోల్ కమిటీ చైర్మన్ అందె బీరన్న గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
త్యాగాల కొలిమిలో నుండి ఎర్రజెండా పుట్టిందని, పోరాటం ద్వారానే హక్కులు సాధించబడతాయని, మేడే స్ఫూర్తితో లేబర్ కోడ్స్ రద్దుకై ఉద్యమిద్దామని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు వీరం మల్లేష్ అన్నారు.
రాజీవ్ యువ వికాసం పథకంలో రుణాల కోసం ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్న వారు దరఖాస్తు పత్రాలను తహసిల్దార్ కార్యాలయంలో అందజేయాలని గోల్కొండ మండల తహసిల్దార్ డి. ఆహల్య సూచించారు.
నిజాంపేట ప్రధాన రహదారి నుంచి నస్కల్ వయా రాంపూర్, నందగోకుల్, చల్మెడ గ్రామాల వరకు రూ.12.40 కోట్ల వ్యయంతో చేపడుతున్న బీటీ రోడ్డు పనులు ఎట్టకేలకు గురువారం ప్రారంభమ య్యాయి.