మరికల్ : రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించాలని కేంద్ర ప్రభుత్వ సహాయ న్యాయవాది, నారాయణపేట జిల్లా బిజెపి అధికార ప్రతినిధి రఘువీర్ యాదవ్ డిమాండ్ చేశారు. గురువారం మరికల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను వెంటనే నిర్వహిస్తూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కచ్చితంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించకపోతే ప్రభుత్వానికి బీసీలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా నాయకుడు నర్సన్ గౌడ్, మండల బిజెపి అధ్యక్షుడు మంగలి వేణుగోపాల్, నాయకులు రమేష్, రాజేష్, నర్సింలు, నిఖిల్, వెంకటేష్, మహేష్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.