కేశంపేట, మే 29 : అనారోగ్యంతో మృతి చెందిన పుట్టవానిగూడ గ్రామ వాటర్మెన్ పాండుయాదవ్(52) కుటుంబానికి జనసేన సీనియర్ నాయకుడు రాజునాయక్, మాజీ సర్పంచ్ జగన్నాయక్లు గురువారం ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా పాండుయాదవ్ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మృతుని భార్య వెంకటమ్మకు రాజునాయక్ రూ.5వేలు, జగన్నాయక్ రూ.4వేలను అందజేశారు.
వాటర్మెన్గా గ్రామ ప్రగతికోసం కృషి చేసిన పాండుయాదవ్ సేవలు మరువలేనివని, అతని కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు. కార్యక్రమంలో శ్రీనునాయక్, శ్రీశైలం, నారాయణ, రాజు, భాస్కర్, రెడ్యానాయక్, రామచంద్రి, పెంటయ్య, తదితరులు పాల్గొన్నారు.