షాద్‌నగర్‌టౌన్, మే 29: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య ఉంటుందని ఎంఈవో మనోహర్ అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ఫరూఖ్‌నగర్ మండలంలో తక్కువ విద్యార్థులు ఉన్న ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు జీడీవడక తండా, శేరిగూడెం, తిమ్మాజిపల్లి తండా, చిన్న చిల్కమర్రి, నేరెళ్లచెరువు గ్రామాలలో ఎన్రోల్మెంట్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్యను అందిస్తారన్నారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని పేర్కొన్నారు.
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఆంగ్ల మాధ్యమాలలో పాఠ్యాంశాలను బోధిస్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి అందరూ కృషి చేయాలని కోరారు. తమ చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే విధంగా తల్లిండ్రులు ముందుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో యా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్, కృష్ణ, జీవిత, విజయలక్ష్మి, సమత, చంద్రకళ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు కృష్ణయ్య, వెంకటయ్య, నర్సింలు, చంద్రశేఖర్, జనార్ధన్, కృష్ణ, సత్యం, సురేష్, మేఘాబాయి, సీఆర్పీలు రవి, భాగ్య, అంగన్వాడీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.