కేశంపేట, మే 29 : ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్లో అసువులుబాసిన మావోయిస్టు సభ్యురాలు విజయలక్ష్మి అలియాస్ భూమికకు మండల పరిధిలోని వేముల్‌నర్వలో గురువారం కుటుంబ సభ్యులు నివాళులు ర్పించారు. ఈ నెల 21న అబూజ్మడ్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన విషయం తెలిసిందే.
ఆమె మృతదేహం కోసం కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నించినా ఛత్తీస్‌గఢ్ పోలీసులు ఏమాత్రం పట్టించుకోకుండా అంత్యక్రియలు చేశారు. విజయలక్ష్మి మృత్యువాత పడి 9రోజులు గడుస్తున్నందున ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాలులర్పించారు. కార్యక్రమంలో ప్రేమ్‌కుమార్‌గౌడ్, నరేందర్‌గౌడ్, నర్సింహులుగౌడ్, శివగౌడ్, సాయికిరణ్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు.