FIFA World Cup | లీగ్ దశలో ఒక్క గోల్ ఇవ్వలే.. ఆరో జట్టుగా మెక్సికో రికార్డు..!
FIFA World Cup : ఆద్యంతం వేడుకలా సాగుతున్న ఫిఫా వరల్డ్‌కప్ 2026లో మెక్సికో(Mexico) చరిత్ర సృష్టించింది. లీగ్ దశలో మూడుకు మూడు మ్యాచుల్లో విజయాలతో నాకౌట్‌కు వెళ్లిన ఆతిథ్య జట్టు.. ప్రత్యర్థిని ఒక్కగోల్ కూడా కొట్టనివ్వలే.
FIFA World Cup : ఆద్యంతం వేడుకలా సాగుతున్న ఫిఫా వరల్డ్‌కప్ 2026లో మెక్సికో(Mexico) చరిత్ర సృష్టించింది. లీగ్ దశలో మూడుకు మూడు మ్యాచుల్లో విజయాలతో నాకౌట్‌కు వెళ్లిన ఆతిథ్య జట్టు.. ప్రత్యర్థిని ఒక్కగోల్ కూడా కొట్టనివ్వలే. తద్వారా.. లీగ్ దశలో శత్రు జట్టుకు ఒక్క గోల్ సమర్పించుకోని జట్టుగా రికార్డు పుస్తకాల్లో నిలిచింది. మొత్తంగా సాకర్ వరల్డ్‌కప్‌లో ఈ అరుదైన ఫీట్ సాధించిన ఆరో జట్టుగా మెక్సికో గుర్తింపు తెచ్చుకుంది.
ఈసారి ఫిఫా వరల్డ్‌కప్‌లో రికార్డులు బద్ధలవుతున్నాయి. లీగ్ దశ 33వ మ్యాచ్‌లోనే వంద గోల్స్ నమోదవ్వడం ఓ రికార్డైతే.. ఆతిథ్య మెక్సికో ప్రత్యర్థికి ఒక్క గోల్ ఇవ్వకుండానే నాకౌట్ చేరింది. బుధవారం చెక్ రిపబ్లిక్‌ను 3-0తో చిత్తు చేసి.. హ్యాట్రిక్ విజయాలతో ఔరా అనిపించిన మెక్సికో వరల్డ్‌కప్ చరిత్రలో అరుదైన ఫీట్ సొంతం చేసుకుంది. ఇదివరకూ నెదర్లాండ్స్(1974), బ్రెజిల్(1986), ఇటలీ(1990), అర్జెంటీనా(1998), ఉరుగ్వే(2018).. ఈ ఐదు జట్లు మాత్రమే లీగ్ దశలో ప్రత్యర్థిని ఒక్క గోల్ కొట్టనివ్వలేదు.
3️⃣ wins, 6️⃣ goals scored and 0️⃣ conceded. 🔥🇲🇽
May this great Group Stage make us even stronger as we go all in for the Round of 32. 🤜🏼🤛🏼#SomosMéxico pic.twitter.com/W2QJmFU1Ft
— Mexican National Team (@miseleccionmxEN) June 26, 2026
గ్రూప్ ఏలోని మెక్సికో తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను 0-2తో ఓడించింది. రెండో గేమ్‌లో దక్షిణ కొరియాను వణికిస్తూ 1-0 విజయం సాధించింది. బుధవారం చెక్ రిపబ్లిక్‌ను 3-0తో ఓడించిన మెక్సికో నాకౌట్ బెర్తు పట్టేసింది. మూడు విజయాలు.. ఆరు పాయిట్లతో అగ్రస్థానం దక్కించుకుంది మెక్సికో. 32వ రౌండ్ తొలి మ్యాచ్‌లో మంగళవారం ఎస్తాడియో అజ్కెకాను ఎడ్సన్ అవ్వరెజ్ సారథ్యంలోని మెక్సికో ఢీకొట్టనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

