మర్పల్లి, మే 29 : నకిలీ మందులు, విత్తనాలు అమ్మితే చర్యలు తీసుకోవడంతో పాటు లైసెన్స్ రద్దు చేస్తామని ఇంటర్నల్ డివిజన్ స్క్వాడ్, పరిగి ఏడీఏ డీఎస్ లక్ష్మి కుమారి అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఏవో శ్రీకాంత్తో కలిసి ఫర్టిలైజర్, పెస్టిసైడ్ షాపులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎంఆర్పీ ధరకన్నా ఎక్కువకు అమ్మారాదని, బిల్లులు తప్పనిసరిగా ఇవ్వాలన్నారు.
నకిలీ మందులు, విత్తనాలు అమ్మినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లూజుగా ఉన్న విత్తనాలు కొనుగోలు చేయొద్దని, అధికృత డీలర్ వద్ద మాత్రమే విత్తనాలను కొనుగోలు చేయాలనీ, రసీదులు తీసుకోని భద్రపరచు కోవాలని రైతులకు సూచించారు. ఆమె వెంట మండల అధికారులు, తదితరులు ఉన్నారు.