Blood Moon | నేడు బ్లడ్మూన్.. మధ్యాహ్నం 3.20 నుంచి చంద్రగ్రహణం
Blood Moon | వినువీధిలో నేడు (మంగళవారం) చంద్రగ్రహణం కనువిందు చే యనున్నది. ‘బ్లడ్ మూన్'గా పిలిచే ఈ దృశ్యాన్ని వీక్షించేందుకు హైదరాబాద్ వా సులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. అలాంటి వారికోసం బిర్లా ప్లానిటోరియం, ఓయూ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 3.20 గంటలకు ‘బ్లడ్ మూన్' దశ ప్రారంభమవుతుంది.
Blood Moon | హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 2 (నమస్తే తెలంగాణ) : వినువీధిలో నేడు (మంగళవారం) చంద్రగ్రహణం కనువిందు చే యనున్నది. ‘బ్లడ్ మూన్’గా పిలిచే ఈ దృశ్యాన్ని వీక్షించేందుకు హైదరాబాద్ వా సులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. అలాంటి వారికోసం బిర్లా ప్లానిటోరియం, ఓయూ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 3.20 గంటలకు ‘బ్లడ్ మూన్’ దశ ప్రారంభమవుతుంది. తెలుగు రాష్ర్టాల్లో సాయంత్రం 6 గంటల తర్వాత దీన్ని చూడొచ్చు. దేశంలోని చాలా ప్రాంతాల్లో 7 నుంచి 25 నిమిషాలపాటు దీన్ని చూసేందుకు వీలుంటుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
భూమి నీడ చంద్రునిపై పూర్తిగా పడినప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. భూ వాతావరణం సూర్యకాంతిని వక్రీకరించి కేవలం ఎరుపు రంగు కిరణాలను మాత్రమే చంద్రునిపైకి ప్రసరింపజేస్తుంది. దీనివల్ల చంద్రుడు ఎరుపు రంగులో మెరుస్తూ కనిపిస్తాడు. దీనినే ‘బ్లడ్ మూన్’ అని పిలుస్తారు. ఎలాంటి కండ్లజోడు, ఇతర రక్షణ పరికరాలు అవసరం లేకుండా నేరుగా దీన్ని చూడొచ్చని, మళ్లీ ఇలాంటి చంద్రగ్రహణం 2028 జులై 6న ఏర్పడే అవకాశం ఉన్నదని శాస్త్రవేత్తలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్యార్డ్, ఎయిర్క్రాఫ్ట్ యార్డ్లో 210 అప్రెంటిస్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

