శుక ఉవాచ- పరీక్షిన్మహారాజా! ఎంగిలిపడక, ఏమరుపాటు లేక మనసు తొంగిలించగా (పరవశించగా) శుభాంగుడైన రథాంగపాణి (విష్ణుని) మంగళకరములైన కథలు అవిశ్రాంతంగా వింటున్న నీకు అనేక మంగళాశాసనాలు.
గోపికలు యశోదతో... ఓ ఇందు వదనా!
మీకు సంపద ఎక్కువగా ఉంటే మిక్కిలి మక్కువతో ఇంపైన విందు భోజనాలు కుడువ- ఆరగించవచ్చు. మేలైన పుట్టములు- పట్టు పీతాంబరాలు కట్టుకోవచ్చు.
‘దేవకీ కాంత విశ్వగర్భ గర్భయగుచు’.. విశ్వగర్భుడు విష్ణువు అర్భక (శిశు) రూపంలో గర్భస్థుడై ఆవిర్భవించే ప్రతి సందర్భంలో హిరణ్యగర్భునికి (బ్రహ్మదేవునికి) ఆయనను స్తోత్రం చేయడం అభ్యాసం- ఆనవాయితీ.
‘ఇదం శరీరం మధు’- అనే శ్రుతి-వేద వాక్యాన్ని బట్టి గృహ, ధన, పుత్ర, మిత్ర, కళత్ర- సతి ఇత్యాదుల కంటే మధువు- తేనె వలె అతిప్రియమైనదగుట చేత, ఇతర జంతు తతి- సముదాయం కంటే శ్రేష్ఠమైన గతి- మోక్షాన్ని కలిగించేది కనుక మానవ దే�
సోమ (చంద్ర) సూర్య వంశాలలో స్వనామ ధన్యులైన- ప్రసిద్ధులైన మహారాజవర్యుల ప్రాభవ- పరిపాలనా వైభవ గరిమను, పరమ భాగవతుల మహిమను విశదపరచే నవమ స్కంధానికి నమోవాకాలర్పిస్తూ, ఇక భాగవత కల్పతరువుకి మూల స్కంధము, కృష్ణమూలమూ
సగరుని తండ్రి బాహుకుడు. అతనిని శత్రురాజులు ఓడించి అడవులపాలు చేశారు. ఆయన అక్కడే కాలధర్మం చెందాడు. ఆయన పెద్ద ఇల్లాలు అప్పటికే నిండు చూలాలు. మగని మరణం ఆమెకు అశనిపాత (పిడుగుపాటు)మయింది. భర్తతో సహగమనానికి పూను�
“రాక్షస రాజా! మీ కులంలో రణ భీరువులు- యుద్ధానికి వెరచి వెన్ను చూపేవారు, వితరణ భీరువులు- దానానికి భయపడి వెనక్కి తగ్గేవారు లేరు. మీ తాత ప్రహ్లాదుడు చుక్కల్లో చంద్రుని వలె ఎంచక్కా ప్రకాశిస్తాడు.