వనస్థలిపురం, మార్చి 11 : నకిలీ డాక్యుమెంట్‌ను తయారు చేసి 400 గజాల ప్లాట్ ను విక్రయించేందుకు యత్నించిన ముఠాను వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేశారు. కేసు వివరాలను బుధవారం వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి వెల్లడించారు. మీర్‌పేట్‌కు చెందిన వల్లాల ప్రేమ్‌కుమార్, జిల్లెలగూడకు చెందిన కోట్ల నాగేంద్ర ప్రసాద్, ప్రశాంతిహిల్స్‌కు చెందిన యెల్మటి సుకుమార్‌రెడ్డి, కర్మన్‌ఘాట్ గ్రీన్‌పార్కు కాలనీకి చెందిన ఇందుర్తి కృష్ణారె డ్డి, కృష్ణాజిల్లా కేతనకొండకు చెందిన ముప్పల్ల సుజాత, పటాన్‌చెరుకు చెందిన నలవల్లి బాలమని, పటాన్చెరు బండ్లగూడకు చెందిన తలారి సులోచన, సూర్యలు ఓ ముఠాగా ఏర్పడ్డా రు.
అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, మునుగనూరులోని సర్వే నంబర్ 60, 74, 75, 76లో ఉన్న 400ల గజాల ప్లాట్‌కు స్కెచ్ వేశా రు. ప్లాట్ ఓనర్ పేరుతో డెత్ సర్టిఫికెట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్, లీగల్ హెయిర్ సర్టిఫికెట్లను తయారు చేశారు. ప్లాట్‌కు సం బంధించిన డాక్యుమెంట్ నంబర్ 645/1987ను వనస్థలిపురంలోని ఓ డాక్యుమెంట్ రైటర్ సహాయంతో నకిలీ పత్రాలు త యారు చేశారు. అనంతరం గరిమెల్ల కామేశ్వరరావు అనే వ్యక్తికి 1.20కోట్లకు విక్రయించేందుకు ఒప్పందం చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ చేసి విక్రయించేందుకు వనస్థలిపురం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లగా డాక్యుమెంట్‌ను చూసి అనుమానించిన అధికారులు, దానిని నిలిపివేశారు.
విషయం తెలుసుకున్న బాధితుడు కామేశ్వరరావు వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. తీగలాగితే డొంక కదిలినట్టుగా మొత్తం నిందితులు బయటకు వచ్చారు. సూర్య మినహా 7మందిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. కాగా ముఠా ఇప్పటికీ ఎన్ని నేరాల కు పాల్పడిందనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం.