బతుకమ్మ సహజ సౌందర్యానికి ప్రతీక. ప్రకృతి మాత ఒడిలో ఒదిగే పూ బాలిక. విశిష్టమైన సంస్కృతి సంప్రదాయాలకు పీఠిక. బతుకమ్మ పండుగ వెనుక ఎన్నో గాథలు. ఆ పాటల్లో దాగినవెన్నో చైతన్య గీతికలు.
కిటికీలు, దర్వాజలు రెక్కలు లేని
ఊహల్ని ఆహ్వానిస్తాయి
బయటి గాలి లోపటి గాలికి మధ్య ఒక అగాధం
ఇల్లు అప్పుడప్పుడు బంధాలతో దూదిలా సాగుతుంది
అక్కరలేని వస్తువుల్లా కొందరు మొగురాలకు అతుక్కుపోతారు
వస్తాయి కొన్ని విషాదపు పిట్టలు
వలస పక్షులుగా వచ్చి వాలుతాయి
మన గుండె కొమ్మలపై
గదుల్లో కొన్నాళ్ళుండి పిల్లలను తీస్తాయి
పాడతాయి కరుకుగా ఉండే పాటలు
మనలోని తడి ఇంకిపోయేదాకా
ముక్కులతో పొడుస్తూ తిరుగాడతా�