అతడొక ఏరు
అతడు ఏరు లాంటివాడు ఆ ఊరు, ఈ ఊరు తిరుగుతాడు బీళ్ళను, మోళ్ళను తడుపుతాడు దారి తప్పడు మాట తప్పడు
అతడు ఏరు లాంటివాడు
ఆ ఊరు, ఈ ఊరు తిరుగుతాడు
బీళ్ళను, మోళ్ళను తడుపుతాడు
దారి తప్పడు మాట తప్పడు
అతడు నిన్న నినదించిన గొంతుక
నేడు ప్రబోధించిన నాలుక
నిన్న అలలై ఎగిసిన సముద్రం
నేడు కలలై విరిసిన సమస్తం
అతడు ఒక తంతు లానో ఒక వంతు లానో పన్జేద్దామనుకోడు
ఈ నేలతో బంధం పెట్టుకొని
జలంతో అభిషేకిద్దామని కల కన్నాడు
కలని సాకారం చేసాడు
అతడు గురిలో ఎదురులేని వాడు
బరిలో పులిలా లంఘించే యుద్ధ కళ ఎరిగినవాడు
సృజన లోకాలకు దారి చూపినవాడు
నవ్యాలోచనలకు బీజం వేసినవాడు
కొత ్తఆవిష్కరణలకు రెక్కలు తొడిగినవాడు
దేశానికి బహుమానం అతడు
వివేక నవ తరానికి సారథి అతడు
విషాద గతానికి, విప్లవ వర్తమానానికి వారధి అతడు
తన పనితనాన్ని, ప్రగతిని వీక్షించక
పరిహసించే ప్రతిపక్షాలకు
నోటి దురుసు నాయకులకు
ప్రగతితోనే సమాధానం చెప్పే నాయకుడతను
– కోటం చంద్రశేఖర్
94920 43348
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
- Tags
- Actions
- KCR
- NT Kavithalu
- poem
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

