పూల సింగిడి
అంబరం నుంచి సంబురంగా అవని మీదికి వంగిన పూల సింగిడి నా తెలంగాణ ‘బతుకమ్మ’ తొమ్మిది రోజుల ఊసులతో తీరొక్క పువ్వుల నవ్వులు
అంబరం నుంచి సంబురంగా
అవని మీదికి వంగిన
పూల సింగిడి
నా తెలంగాణ ‘బతుకమ్మ’
తొమ్మిది రోజుల ఊసులతో
తీరొక్క పువ్వుల నవ్వులు
వికసిస్తాయి కనువిందు చేస్తాయి
ఊయల ఊపులతో
ఉత్సవమొస్తుంది
చెరువులు బావులూ
నదీ ప్రవాహాలపై
రంగురంగుల పూల హంగులతో
బతుకమ్మ నాట్యమాడుతుంది
చిత్తూ చిత్తూల బొమ్మగా
శివుడీ ముద్దుల బొమ్మగా
బతుకమ్మ పూజలందుకుంటది
బంతి చామంతులు
గునుగు తంగేడు రుద్రాక్షలు
సీతమ్మ జడ రామబాణాల పూలు
పురివిప్పిన నెమళ్లవుతాయి
పుడమి పుడమంతా
పూలబుట్టయినట్టుంటది
అట్ల బతుకమ్మ అలిగిన బతుకమ్మ
వెన్నముద్దల బతుకమ్మ
వేడుకలు ఊయలలూగుతై
ఆటపాటలు పొద్దును దాటి
సద్దుల బతుకమ్మ సాగిపోతది
పల్లె సుద్దులను అద్దుకొని
పదిలమైపోతది
పాటల పూదోటైపోతది
సామూహిక సంరంభమై
కోలాటాల సవ్వడి జేస్తది
సమిష్టి జీవనగీతికై
సమైక్య భావన పతాకై
బతుకుపాటల్ని పల్లవిస్తది
కన్నీటి చెలమెలను తీసి కవ్వించుకుంటది
ఆత్మీయ చెలిమితో హత్తుకుంటది
బతుకమ్మ ఓ విజయగాథల అంగడి
సాంస్కృతిక పూల సింగిడి..!
– డాక్టర్ కటుకోఝ్వల రమేష్
99490 83327
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

