పచ్చి గాయాల వాసన
బిల్కిస్.. నువ్వలా చూడకు నీ చూపులకు ఎగురవేసిన జెండా ఇంకా కొట్టుమిట్టాడుతూనే ఉన్నది నీలాగే.. అచ్చం నీలాగే..
బిల్కిస్.. నువ్వలా చూడకు
నీ చూపులకు ఎగురవేసిన జెండా
ఇంకా కొట్టుమిట్టాడుతూనే ఉన్నది
నీలాగే.. అచ్చం నీలాగే..
కాషాయపు ముడిలో చిక్కుకొని స్వేచ్ఛకై నినదిస్తున్నది
మనదీ.. కర్మ భూమి కదా బిల్కిస్
గంజి తాగే నోటిలో ’అమృతం’ కురుస్తుందా చెప్పు?
మగసిరిని బజార్లో ఎత్తుకొని
ఊరేగిస్తూ జేజేలు కొడుతున్న దేశం మనది
నీ కన్నీటి చుక్కల్ని ఎవరు తుడుస్తారు చెప్పు బిల్కిస్?
సెక్షన్లు, జీ.వోలు
మనకు ఎప్పుడూ అందని ద్రాక్షనే కదా
కోర్టు కళ్ళు మూసుకుంది నల్లచొక్కాలు చేతులెత్తేశాయి
చట్టం తన పని తాను చేసుకెళ్ళింది
ఎప్పటిలాగే మనం బలిపశువులుగా మిగిలాం అంతే!
బిల్కిస్.. తిరుగబడ్డ గాయం సాక్షిగా
ఇప్పుడు ఈ దేశం జెండా కూడా
పచ్చి గాయాల వాసనేస్తున్నది!
– బిల్ల మహేందర్
9177604430
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korean Hackers: ఆ చోరీ వెనుక ఉన్నది నార్త్ కొరియా హ్యాకర్లే
Srinivas Goud | కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి దయనీయం : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
‘కేసుల్లో కన్విక్షన్ శాతం పెంచేలా సమర్థవంతంగా పని చేయాలి’
అన్ని డివిజన్ల సమగ్ర అభివృద్ధే లక్ష్యం : నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య
Patlolla karthik Reddy | డైరెక్టుగా గెజిట్ వచ్చింది.. సీఎంకు సంబంధం లేదంటే నమ్ముదామా..? : పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

