SIR Exercise | త్వరలో తెలంగాణసహా 22 రాష్ట్రాల్లో ‘సర్’.. సిద్ధమవుతున్న కేంద్ర ఎన్నికల సంఘం
SIR Exercise : ఇప్పటికే పశ్చిమ బెంగాల్, అసోం, కేరళ వంటి రాష్ట్రాల్లో ‘సర్’ను పూర్తి చేసింది సీఈసీ. ఇప్పుడు మిగతా రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా ‘సర్’ చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఇందులో తెలంగాణ కూడా ఉంది.
SIR Exercise : నిజమైన ఓటర్లను గుర్తించేందుకు, అర్హతలేని, అక్రమ ఓట్లను తొలగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ‘సర్’ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పశ్చిమ బెంగాల్, అసోం, కేరళ వంటి రాష్ట్రాల్లో ‘సర్’ను పూర్తి చేసింది సీఈసీ. ఇప్పుడు మిగతా రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా ‘సర్’ చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఇందులో తెలంగాణ కూడా ఉంది.
మన రాష్ట్రంతోసహా 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈసారి ‘సర్’ చేపడుతారు. ఇప్పటికే కొనసాగుతున్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతోపాటు మిగిలిన రాష్ట్రాల్లోనూ ‘సర్’ నిర్వహిస్తారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి కొత్త ‘సర్’ మొదలవుతుంది. ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్, బిహార్లలో కొనసాగుతోంది. బిహార్‌లో ముగింపు దశకు చేరుకుంది. ఢిల్లీ, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లదాఖ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, ఒడిశా, పంజాబ్, సిక్కిం, త్రిపుర, తెలంగాణ, ఉత్తరాఖండ్, ఝార్ఖండ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, చండీగఢ్, దాద్రా అండ్ నగర్ హవేలి, డామన్ అండ్ డియులో ఏప్రిల్ నుంచి ‘సర్’ చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
‘సర్’లో భాగంగా బూత్ లెవల్ ఆఫీసర్లు ఇంటింటికీ తిరిగి ఓటర్లను గుర్తిస్తారు. ఆ ఇంట్లో ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఆధార్ వంటి ధృవపత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ తమ వివరాలు సమర్పించి ఓటు హక్కు నమోదు చేసుకోవచ్చు. సరైన డాక్యుమెంట్లు లేని ఓట్లను తొలగిస్తారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

