Tax evasion | రూ.70,000 కోట్ల పన్నులు ఎగ్గొట్టిన రెస్టారెంట్లు.. హైదరాబాద్‌లో బయటపడ్డ స్కాం
Tax evasion : భారతీయ రెస్టారెంట్లు భారీగా పన్నులు ఎగవేశాయి. దాదాపు రూ.70,000 కోట్ల పన్నులు ఎగవేసినట్లు తాజా అంచనా. దీనికి సంబంధించిన సమాచారాన్ని అధికారులు గుర్తించారు.
Tax evasion : భారతీయ రెస్టారెంట్లు భారీగా పన్నులు ఎగవేశాయి. దాదాపు రూ.70,000 కోట్ల పన్నులు ఎగవేసినట్లు తాజా అంచనా. దీనికి సంబంధించిన సమాచారాన్ని అధికారులు గుర్తించారు. ఇటీవల హైదరాబాద్‌లోని రెస్టారెంట్లపై ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కొన్ని రెస్టారెంట్లలో బిల్లులు తక్కువగా చూసి, పన్నులు ఎగవేస్తున్నట్లు గుర్తించారు. దీనికి సంబంధించిన సాంకేతిక అంశాల్ని పరిశీలిస్తూ వెళ్లగా భారీ స్కాం బయటపడింది.
దేశంలోని పలు రెస్టారెంట్లు దాదాపు రూ.70,000 కోట్ల పన్నులు ఎగవేసినట్లు తేలింది. హైదరాబాద్ రెస్టారెంట్ల నుంచి మొదలైన తనిఖీ.. జాతీయ స్థాయి వరకు వెళ్లింది. రెస్టారెంట్లు తమ బిల్లింగ్ కోసం దేశవ్యాప్తంగా ఒక ప్రముఖ సంస్థకు చెందిన సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్నారు. అయితే, దీనిలోని లోపాల్ని ఆధారం చేసుకుని, సాఫ్ట్వేర్ దుర్వినియోగం చేస్తూ బిల్లుల్ని తక్కువగా చూపుతున్నారు. యూపీఐ, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు వంటి వాటి ద్వారా చేసే చెల్లింపుల్ని మాత్రమే లెక్కల్లో చూపుతున్నారు. కానీ, క్యాష్ ద్వారా జరిగే బిల్లుల్ని డిలీట్ చేస్తున్నారు. దీంతో ఆ రెస్టారెంట్లలో తక్కువ వ్యాపారం జరిగినట్లు చూపించి, ప్రభుత్వానికి పన్నులు కూడా తక్కువగానే కడుతున్నారు. కొన్నిసార్లు అసలు బిల్లులే రాలేదని కూడా చూపుతున్నారు.
దేశంలోని 1.77 లక్షల రెస్టారెంట్లకు సంబంధించిన బిల్లుల సాఫ్ట్‌వేర్‌ను పరిశీలించి అధికారులు ఈ విషయం చెబుతున్నారు. దొంగ బిల్లులకు కారణమైన సాఫ్ట్‌వేర్‌ను 10 శాతం కంపెనీలు వాడుతున్నాయి. వీటికి సంబంధించి 60 టీబీ డాటాను అధునాతన టెక్నాలజీ, ఏఐ ద్వారా పరిశీలించగా ఈ విషయం బయటపడింది. మొత్తంగా రెస్టారెంట్లు తమ బిల్లుల్లో 27 శాతం వరకు లెక్క చూపడం లేదు. ఇలా దేశవ్యాప్తంగా ఉన్న అనేక రెస్టారెంట్లు 2019-20 నుంచి 2025-26 వరకు రూ.70,000 కోట్ల పన్నుల్ని ఎగవేశాయి. ఏపీ, తెలంగాణలోని రెస్టారెంట్లు ఐదేళ్ల కాలంలో రూ.5,141 కోట్లు ఎగవేశాయి. అందులో 40 రెస్టారెంట్లు కలిపి రూ.400 కోట్లు ఎగవేశాయి. ఇక అత్యధిక బిల్లులు ఎగ్గొట్టిన రాష్ట్రాల్లో కర్ణాటక రూ.2,000 కోట్లతో మొదటి స్థానంలో ఉంది.
రూ.1,500 కోట్లతో తెలంగాణ రెండో స్థానంలో, రూ.1,200 కోట్లతో తమిళనాడు మూడో స్థానంలో ఉంది. కాగా.. బిల్లుల్లో మోసాలకు పాల్పడి పన్నులు ఎగ్గొట్టిన రెస్టారెంట్లపై చర్యలు తీసుకుంటామని ఆదాయపు పన్ను శాఖ అధికారులు అంటున్నారు. ఇంకా ఈ అంశంపై విచారణ కొనసాగుతోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

