జైనూర్ : ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జైనూర్ పోలీసులు( Jainur police ) పశువుల అక్రమ రవాణాను ( Cattle smuggling) అడ్డుకున్నారు. జామ్గావ్ గ్రామ శివారులో చెక్పోస్ట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తు గురువారం మధ్యాహ్నం జైనూర్ వైపు నుంచి వచ్చిన ఐచర్ వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. ఈ వాహనంలో ఉన్న 23 పశువులను అక్రమంగా తరలిస్తుండడాన్ని గుర్తించి వాహనంలో ఉన్న ముగ్గురు వ్యక్తులను విచారించారు
. జైనూర్ పశువుల మార్కెట్ నుంచి పశువులను కొనుగోలు చేసి సరైన సదుపాయాలు లేకుండా తరలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. వాహనాన్ని , 23 పశువులను స్వాధీనం చేసుకుని, ముగ్గురు నిందితులను జైనూర్ పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్సై రవికుమార్ తెలిపారు. జంతువులను అక్రమంగా , క్రూరంగా రవాణా చేసే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.