గాయంతి దేవాః కిలగీత కాని
ధన్యాస్తుయే భారతభూమి భాగే
స్వర్గాపవర్గాస్పద మార్గభూతే
భవంతి భూయః పురుషాః సురత్వాత్
ఓ భారత మాతా! నీ బిడ్డలుగా పుట్టడం మా జన్మ జన్మల సుకృతం. నిన్ను గూర్చి దేవతలు గానం చేస్తున్నారు. స్వర్గలోకమునకు మోక్షమునకు నీవే మార్గము. సోపానము నీవే. ఎంతో పుణ్యము చేసికొనిన ప్రాణికి మాత్రమే నీ సంతతిగా పుట్టే భాగ్యం లభిస్తుంది.
– టి.సుధాకరశర్మ