‘ఆడపిల్లలు ఎదిగేకొద్దీ స్వేచ్ఛగా జీవించాల్సిందిపోయి.. అడుగడుగునా భయంతో బతకాల్సిన పరిస్థితులు సమాజంలో నెలకొనడం బాధాకరం, దురదృష్టకరం..’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది బాలీవుడ్ నటి కృతి సనన్. దేశంలో మహిళలపై, బాలికలపై జరుగుతున్న వరుస లైంగిక వేధింపులు, దాడులపై ఇటీవల ఓ ప్రైవేటు కార్యక్రమంలో మాట్లాడుతూ కృతి సనన్ భావోద్వేగానికి లోనైంది. ‘స్త్రీల జీవితాల్లో భయం ఓ భాగమైపోయింది.
సాయంత్రాలు ఇళ్లలోంచి బయటకు రావాలన్నా.. ఒంటరిగా ప్రయాణించాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి. ఇలా భయం గుప్పెట్లో బతకడం ఎన్నాళ్లు? స్త్రీలకు, మరీ ముఖ్యంగా మైనర్ బాలికలకూ భయంలేని సురక్షిత వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత సమాజంపై ఉంది. ప్రభుత్వం ఈ వ్యవహారంపై కఠినమైన చట్టాలను తీసుకురావాలి. సమాజంలో స్త్రీల పట్ల ఉన్న దృక్పథంలో కూడా మార్పు రావాలి’ అంటూ ఉద్వేగపూరితంగా మాట్లాడింది కృతి సనన్.