వేలకోట్లకు భారతిని
విపణిలో నిలబెట్టు
కుట్రదారుల చీల్చి చెండాడిన అద్భుతం
దుష్ట పన్నాగాలకికడ
చోటు లేదు పోపొమ్మని
తెలంగాణ బిడ్డ గర్జించిన సుదినం
దేశద్రోహులను తరిమికొట్టేందుకు
షరతులేమియు లేక వామపక్షాలు
ఎరుపు తిలకం దిద్దిన ఫలితం
అభివృద్ధి సంక్షేమ ఆత్మగౌరవాల
ఆలవాలమైన మాగాణ తెలగాణ
అన్యులకు చోటివ్వనన్న సింహనాదం
నమ్ముకున్న ప్రజను
తన రెక్కల కింద కమ్ముకుని
చంద్రశేఖరుడు వేగుచుక్కైన తరుణం
తదేక దీక్షతో తండ్రంటి పాలకుని
తపనను తనఃమనాఃల దాల్చి
రణన్నినాదాన శ్రేణి రసించిన రూపం
జనరంజక పాలన
దేశమంతా అందివ్వమని
భారాసకు సద్దికట్టిన కారణం
రానున్న కాలాన
అందరమొకటై
రాజ్యాంగ రక్షలో రాజిల్లు లక్ష్యం
జై తెలంగాణ, జై భారత్
#KCR #BRS
#TELANGANA
#BJPMUKTHBHARAT
– శ్రీశైల్ రెడ్డి పంజుగుల
90309 97371