గుండె చెట్టు!
చెట్లుండాలి.. పక్షులుండాలి
నేల పచ్చదనమై పురివిప్పాలి
ఆకాశంలో నక్షత్రాల్లా పక్షులు
గుంపులు గుంపులై వాలాలి
వట్టిపోతున్న మట్ట మీద
మామిడి, యాప, మర్రి,
రావి నేరడునో నాటు…
హరితహారానికి సాళ్లు పోసి
కాలచక్రానికి ఊపిరిపోయి
చెట్లే మన బిడ్డలు..
పక్షులే మన సుట్ట బలగాలు
హరిత హారమే
భూగోళానికి ఆకుపచ్చ సౌందర్యం!
మొక్కనాటని
మనిషిని మనువాడనని
చెట్టులేనింటితో సుట్టరికమే చేయనని
వంటకు, ఇంటికి
చెట్లను నరుకనని ప్రతిజ్ఞలు పూనుదాం
నేటి పిల్లలే రేపటి పౌరులు
నేటి మొక్కలే రేపటి మహా వృక్షాలు
మనిషే మొక్కై మొలవాలి
మనిషే దేశమై నిలవాలి
దేశమే హరిత నిధై వెలుగాలి
జాతికి గుండె చెట్టు!!
చెట్టే… జాతీయ జెండా
చెట్టే… కాగితం కలం
చెట్టే…కాలుష్యం తల నరికే వజ్రాయుధం!
చెట్టే జాతీయ గేయమై
చెట్టే బుద్ధుడై.. చెట్టే చరిత్రలో
నిలిచే అశోకునిలా
కలకాలం హరితంగా వెలుగుదాం!
వనపట్ల సుబ్బయ్య:94927 65358
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vice President | శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి
లక్ష్మీపురంలో గ్రామ మహిళా సంఘ భవనం ప్రారంభం
Jobs | డిగ్రీ అర్హతతో రైల్వేలో 1250 స్టేషన్ మాస్టర్ పోస్టులు.. నవంబర్ 25 చివరితేదీ
Boy Fakes Kidnap | తండ్రి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసేందుకు.. కిడ్నాప్ నాటకం ఆడిన యువకుడు
కోట మైసమ్మ జాతర ఆదాయం రూ.32,02,697
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

