‘అవనిలో సగం... ఆకాశంలో సగం... అన్నిటా సగం సగం’ అంటూ నినదిస్తున్న కాలంలో మనం ఉన్నాం. ఈ నినాదం వెనుక యుగయుగాల ధీరోదాత్త చరిత్ర ఉన్నదన్న విషయం తెలిసిందే. అయినా పురుషాధిక్య ప్రపంచంలో స్త్రీ ప్రతిక్షణం పోరాడుతూన
మనిషికి, దేవుడికి ఏమిటీ సంబంధం? ఈ ప్రశ్నకు ఒక్కొక్కరూ ఒక్కో రకమైన సమాధానం చెబుతారు. కానీ, అసలైన జవాబు యువ ఫొటోగ్రాఫర్ వినోద్ వెంకపల్లి ఛాయాచిత్రాల్లో కనిపిస్తుంది. దైవానుగ్రహం కోసం పరితపించే సామాన్య భ�
‘అలల ఊపులో తీయని తలపులు చెలరేగుతాయ’ని అన్నాడో సినీకవి. ఇలాంటి వలపులు ఎక్కడపడితే అక్కడ సుడి తిరగవు. కొలునులో నీరు నిద్దురోయినట్టే ఉండాలి. కొత్త పెండ్లి కూతురు కుదురుగా కూర్చోవడానికి గూటి పడవ కావాలి. మంచు �
మన దగ్గర అంతగా ఇబ్బంది పెట్టే చలి ఉండదు కనుక.. మూడు కాలాల్లోకీ ‘చలికాలం’ నాకెంతో ఇష్టం. ఆరునెలల పరీక్షలు అయిపోవడం, సంక్రాంతి సెలవులు రావడంతో, పగ్గాలు విడిచిన లేగదూడల్లా గంతులేసేవాళ్లం.
మా ఊర్లో వంట అయ్యగార్ల ఇళ్లు పెద్దగా లేవు. ఉన్న ఒకటి రెండు ఇళ్లల్లో మగవాళ్లు చదువుకొని ఉద్యోగాలు చేసేవాళ్లు లేదా వైష్ణవ ఆలయాల్లో పూజారులుగా ఉండేవాళ్లు. వాళ్లకు వ్యవసాయ భూములూ, మంచి ఇళ్లూ ఉండడంతో బయటివాళ�
మా అయిదుగురు మేనత్తల్లో ముగ్గురివి జనగామ దగ్గర్లో ఇటూ అటుగా అన్నీ పల్లెటూళ్లే. చాలా మారుమూల గ్రామాలనో, లేక నీటి వసతి ఉండదనో, ప్రయాణం చేస్తుంటే విపరీతమైన దుమ్ము రేగి, ఒంటి నిండా సన్నటి ధూళి పడడం వల్లనో... మర�
లాంగ్ లాంగ్ ఎగో.. సో లాంగ్ ఎగో.. ఫెస్టివల్‌కు ముందు రకరకాల కళాకారులు పల్లెబాట పట్టేవాళ్లు. తమదైన కళతో పండుగ వినోదాన్ని పదింతలు చేసేవాళ్లు. దసరా వచ్చిందంటే పగటి వేషగాళ్లకు తీరిక ఉండేది కాదు! ఇంటి వాకిలే.. �
కొందరికి ఉదయాన్నే వేడివేడిగా పొగలు కక్కే కాఫీ కడుపులో పడాల్సిందే! తలనొప్పి వచ్చినా.. అలసటగా అనిపించినా.. నలుగురు మిత్రులు కలిసినా.. మరో కప్పు కాఫీ తాగాల్సిందే! అలాంటి కాఫీప్రియుల కోసం.. ‘స్మెగ్' సంస్థ.. ‘మిన
ఏ నాగరికతను సృష్టించినా మానవుని దృష్టి యావత్తూ పరిసర ప్రకృతిమీదికే వ్యాపించుతున్నది. కట్టెదుట కనిపించుతున్న తాత్కాలిక సమస్యలను మాత్రమే అర్థం చేసుకోగలుగుతున్నాము. తాత్కాలికంగా ఏర్పడ్డ ఆ బాధలకు పరిష్క
ఒకప్పుడు కిలోబైట్ల (కేబీ)లో ఉండే ఫొటోలు.. ఇప్పుడు మెగా బైట్ల (ఎంబీ)లోకి మారిపోయాయి. ఇక సినిమాలైతే.. గిగా బైట్లలోనే ఉంటున్నాయి. హై రిజల్యూషన్ ఫొటోలు, 4కే సినిమాలను కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లలో స్టోర్ చేసుకో�
చిన్ననాటి పరిస్థితులు తల్చుకుంటే ఇప్పటికీ గుండె గుభేలుమంటుంది. నా అనుభవాలు పగవారికి కూడా కలుగకూడదనే నా అభిలాష. గుడివాడ తాలూకా చౌటపల్లి గ్రామంలో 1923 జనవరి 3వ తేదీన జన్మించాను. మా నాన్నగారికి సంగీతంలో మంచి ప
రేడియో మోగింది.. యక్షగానాలు మందగించాయి. టీవీ వచ్చింది.. తోలుబొమ్మలు చిన్నబుచ్చుకున్నాయి. సినిమా రంగులద్దుకుంది.. ఒగ్గు కథలు తగ్గిపోయాయి. దృశ్య మాధ్యమాలు జనాలకు దగ్గరయ్యే కొద్దీ.. జానపద కళలు అదృశ్యమవుతూ వచ�
జరిగిన కథ : పినచోడుని మరణవార్తతో.. హుటాహుటిన దనదప్రోలుకు ప్రయాణమయ్యాడు జాయపుడు. తండ్రి శ్రాద్ధకర్మలన్నీ జరిపించాడు. అనుమకొండ వెళ్లాక నీలాంబ నివాసానికి వెళ్లాడు. సగం శరీరం కాలి.. జీవచ్ఛవంలా తల్పానికే పరిమ�
నవాబుల నగరంగా పేరున్న లక్నో గాలి సోకగానే కవిత్వం ముంచుకొస్తుంది. పాట పొంగుకొస్తుంది. నాట్యం వెల్లివిరిస్తుంది. దక్కనీ షాన్ హైదరాబాద్‌కు ఉత్తరాది ప్రతిబింబంలా దర్శనమిస్తుంది లక్నో! ఆహార్యంలోనే కాదు.. ఆ�