కొందరికి ఉదయాన్నే వేడివేడిగా పొగలు కక్కే కాఫీ కడుపులో పడాల్సిందే! తలనొప్పి వచ్చినా.. అలసటగా అనిపించినా.. నలుగురు మిత్రులు కలిసినా.. మరో కప్పు కాఫీ తాగాల్సిందే! అలాంటి కాఫీప్రియుల కోసం.. ‘స్మెగ్’ సంస్థ.. ‘మినీ ప్రొ ఎస్ప్రెసో కాఫీ మెషిన్’ను తయారుచేసింది. ఈ యంత్రాన్ని కొనుగోలు చేస్తే.. ప్రతిరోజూ బరిస్టా, కెఫే డేలాంటి ఆథెంటిక్ కాఫీని మీ వంటింట్లోనే తయారు చేసుకోవచ్చని సంస్థ చెబుతున్నది. ఇందులో ట్రిపుల్ థర్మల్ బ్లాక్ సిస్టమ్ ఏర్పాటుచేయడం వల్ల కేవలం నిమిషాల్లోనే.. కాఫీకి కావాల్సిన ఉష్ణోగ్రతలను అందిస్తుంది. పూర్తిగా స్టెయిన్లెస్ స్టీల్‌తో తయారైన ఈ కాఫీ మెషిన్ ఎక్కువ కాలం మన్నుతుంది కూడా. ఈ యంత్రంతోనే ఒక స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంపర్, రెండు ఫిల్టర్లు, ఒక పాల మగ్ కూడా సంస్థ అందిస్తున్నది. ఇటలీలో తయారై, రెండు రంగుల్లో లభ్యమవుతున్న కాఫీ మెషిన్ ధర.. రూ. 1,37,000. smeg.comలో లభిస్తుంది.
ఖరీదైన 3డీ వ్యవహారాన్ని ఇప్పుడు కారుచౌకగా అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ.. ఏసర్. ‘స్పాటియల్యాబ్స్ ఐస్’ పేరుతో 3డీ కెమెరాను తయారుచేసింది. రెండు 8ఎంపీ కెమెరాలు కలిగిన ఈ పరికరం.. 3డీలో ఫొటోలు, వీడియోలు తీస్తుంది. రియల్‌టైమ్ 3డీ స్ట్రీమింగ్‌ను కూడా అందిస్తుంది. అంటే, మీరు 3డీలో లైవ్ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహించుకోవచ్చు. ఇక వ్లాగర్లు.. తమ స్టోరీలను 3డీలోనూ చూపించవచ్చు. 3డీలో వీడియోకాల్స్ కూడా చేసుకోవచ్చు. 2.4 అంగుళాల టచ్‌స్క్రీన్, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్లాంటి అదనపు ఫీచర్లు కలిగిన ఈ 3డీ కెమెరా ఖరీదు.. రూ. 45,876. acer.com/inద్వారా ఆర్డర్ ఇవ్వొచ్చు.
ఇప్పుడంతా 4కేలో సినిమాలు, హై రిజల్యూషన్‌లో ఫొటోలు వస్తున్నాయి. దాంతో పర్సనల్ కంప్యూటర్లో మెమరీ ఏమాత్రం సరిపోవడం లేదు. ఈ సమస్యను అధిగమించడానికి సాన్‌డిస్క్ సంస్థ.. సరికొత్త డెస్క్ డ్రైవ్‌ను మార్కెట్లో విడుదల చేసింది. విండోస్, మ్యాక్.. రెండు ఓఎస్లపైనా పనిచేసే ఈ డెస్క్డ్రైవ్.. 1000 ఎంబీపీఎస్ వేగంతో డేటాను రీడ్ చేస్తుంది. డెస్క్‌టాప్ హార్డ్‌డిస్క్ డ్రైవ్ కన్నా నాలుగురెట్ల వేగంతో పనిచేస్తుంది. మీ ఫొటోలు, మీకు నచ్చిన సినిమాలు, పాటలు, ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్లను సులభంగా స్టోర్ చేసుకోవచ్చు. కాంపాక్ట్ డిజైన్‌తో వస్తున్న ఈ ఎక్స్టర్నల్ డెస్క్డ్రైవ్ కేవలం 268 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. కాబట్టి, ఎక్కడికంటే అక్కడికి సులభంగా తీసుకెళ్లవచ్చు. మూడేళ్ల వారంటీ, రెండు వేరియంట్లలో వస్తున్న సాన్‌డిస్క్ డెస్క్ డ్రైవ్ ధర.. రూ. 39,999 (4 టీబీ), రూ. 72,999 (8 టీబీ). westerndigital.comద్వారా కొనుగోలు చేయవచ్చు.
చేతిలో గిర్రున తిరిగే ఫిడ్జెట్ స్పిన్నర్.. మానసిక ఒత్తిడిని దూరం చేస్తుందనీ, ఏకాగ్రత పెంచుతుందనీ మానసిక నిపుణులు చెబుతున్న మాట. అలాగే, పాటలు వినడం వల్ల కూడా ఒత్తిడి తగ్గుతుందన్న విషయం తెలిసిందే! ఈ రెండిటినీ జోడిస్తూ ‘న్యూ రిపబ్లిక్’ సంస్థ.. ‘సైబర్స్టడ్ స్పిన్’ను తీసుకొచ్చింది. ఇయర్ బడ్స్ కేస్‌నే.. ఫిడ్జెట్ స్పిన్నర్‌గా తయారుచేసింది. ఇంకేం.. ఓవైపు పాటలు వింటూ, మరోవైపు ఫిడ్జెట్తో ఆడుకుంటూ ఒత్తిడిని చిత్తు చేసేయొచ్చు. ఈ ఇయర్ బడ్స్ ద్వారా 70 గంటలపాటు నాన్‌స్టాప్‌గా పాటలు వినొచ్చు. ఇందులోని ఎక్స్-బాస్ టెక్నాలజీ వల్ల అద్భుతమైన సంగీతాన్ని ఆస్వాదించవచ్చు. టచ్ కంట్రోల్స్, డ్యూయల్ మోడ్ (గేమ్/ మ్యూజిక్)లాంటి ఫీచర్లూ ఉన్నాయి. మన్నికగా ఉండే మెటల్ ైగ్లెడర్స్తో వస్తున్న ‘సైబర్స్టడ్ స్పిన్’ ధర.. రూ. 2,499. nurepublic.coలో లభిస్తుంది.