ఘంటసాల సంగీత ప్రయాణం
చిన్ననాటి పరిస్థితులు తల్చుకుంటే ఇప్పటికీ గుండె గుభేలుమంటుంది. నా అనుభవాలు పగవారికి కూడా కలుగకూడదనే నా అభిలాష. గుడివాడ తాలూకా చౌటపల్లి గ్రామంలో 1923 జనవరి 3వ తేదీన జన్మించాను. మా నాన్నగారికి సంగీతంలో మంచి ప్రావీణ్యత ఉండేది.
చిన్ననాటి పరిస్థితులు తల్చుకుంటే ఇప్పటికీ గుండె గుభేలుమంటుంది. నా అనుభవాలు పగవారికి కూడా కలుగకూడదనే నా అభిలాష. గుడివాడ తాలూకా చౌటపల్లి గ్రామంలో 1923 జనవరి 3వ తేదీన జన్మించాను. మా నాన్నగారికి సంగీతంలో మంచి ప్రావీణ్యత ఉండేది. ఆయన సంగీతం పాడుతుంటే నేను నృత్యం చేస్తుండేవాణ్ణి (ఆ విషయం ఇప్పుడు తల్చుకుంటేనే నవ్వొస్తూ ఉంది).
నాకు పదో ఏడు వచ్చేసరికి మా నాన్నగారు మరణించారు. మా మేనమామగారి పెంపకంలోనే ఉంటూ వచ్చాను. నా విద్యాభ్యాసమంతా గుడివాడలోనే జరిగింది. కాని ఆ రోజుల్లో చదువేమాత్రం ఒంటబట్టలేదు. ఎంతసేపూ సంగీతం మీదే ఆసక్తి ఉండేది. కపిలవాయి పాటలు, పద్యాలు అంటే చెవి కోసుకునేవాణ్ణి. దాంతో ఫోర్తు ఫారంతోనే చదువుకు స్వస్తి చెప్పాను. అక్కడినుంచి నాటకాల్లో వేషాలు వేశాను. నాటకాల వ్యామోహంతో సంగీతంపై ఆసక్తి ఎక్కువైంది. సంగీతం నేర్చుకుంటే ఎక్కడైనా నాలుగు పాఠాలు చెప్పైనా పొట్ట పోషించుకోవచ్చుననిపించింది. వెదుళ్లపల్లిలో సుసర్ల కృష్ణబ్రహ్మశాస్త్రి గారి శుశ్రూష చేసి సంగీతం నేర్చుకోవాలని వెళ్లాను. కాని అక్కడ నేను నేర్చుకున్నదల్లా గురువుగారి పిల్లల పొత్తిగుడ్డలు ఉతకటం మాత్రమే.
ఇక్కడిట్లా ఎన్నాళ్లు చాకిరీ చేసినా సంగీతం వచ్చే మార్గం లేదని భీమవరం దగ్గరున్న కొండపల్లి చేరాను. అక్కడ ఘంటసాల నాగభూషణంగారు ఉండేవారు. ఆయన ఫిడేలు వాద్యంలో నిపుణులు. దగ్గర బంధువు కావటం వల్ల సంగీతం బాగా నేర్చుకోవాలనే ఆశ కలిగింది. కాని అక్కడ వంటచేసే ఖర్మ పట్టింది. పొత్తిగుడ్డలు ఉతకటంతో నేర్చిన గీతాలు పాకశాస్త్రంతో పెద్ద వర్ణాల వరకూ వచ్చింది. ఇక్కడ ఉంటుండగానే ఆ గ్రామానికి దగ్గరలో ఉన్న ఇంకొక ఊర్లో కొంతమంది కుర్రాళ్లను పోగుచేసి ‘సారంగధర’ నాటకం తర్ఫీదు ఇచ్చేవాడిని. వాళ్లంతా కలసి అప్పుడప్పుడూ ఏమైనా ముట్టజెప్తుండేవారు. కాని దానివల్ల లాభం లేదనుకుని నా ఉంగరాన్ని అక్కడే అమ్మేసి ఎవరికీ చెప్పకుండా విజయనగరం చేరాను.
మన ఘంటసాల
డా.పి.ఎస్. గోపాలకృష్ణ రచన నుంచి
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

