ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Science-technology - Aug 07, 2020 , 14:13:09

అసుస్‌ ROG ఫోన్‌ 3 సేల్‌ ప్రారంభం..1500 డిస్కౌంట్‌

అసుస్‌  ROG ఫోన్‌  3 సేల్‌ ప్రారంభం..1500 డిస్కౌంట్‌

న్యూఢిల్లీ: గేమింగ్‌ ప్రియుల కోసం   అసుస్ సంస్థ  ప్లాగ్‌షిప్‌  స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది.   అసుస్‌ రిపబ్లిక్‌ ఆప్‌ గేమర్స్‌(ROG) ఇటీవల  గేమింగ్‌ స్మార్ట్‌ఫోన్‌ ROG ఫోన్‌  3ని విడుదల చేసింది.  ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌  సందర్భంగా ఇండియన్‌ యూజర్లు ఫోన్‌ను కొనుగోలు చేయొచ్చు.  ఫ్లిప్‌కార్ట్‌ స్పెషల్‌ సేల్‌ ఐదురోజుల పాటు ఉంటుంది. రోగ్‌ ఫోన్‌ 3 విక్రయాలు ఆగస్టు 10 సోమవారం అర్ధరాత్రి వరకు కొనసాగుతుంది.

8GB ర్యామ్‌  +128 GB స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.. 49,999 కాగా, 8 GB ర్యామ్‌ + 256 GB స్టోరేజ్‌  వేరియంట్‌ ధర రూ. 57,999గా ఉంది.  సిటీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులు, ఐసీఐసీఐ  బ్యాంక్ క్రెడిట్ కార్డులపై   1,500  ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ కూడా కూడా అందిస్తోంది.


logo