సీపీఎం నేత సీతారాం ఏచూరి ఇంట విషాదం..
సీతారాం ఏచూరి| సీపీఎం ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి ఇంట్లో కరోనా వైరస్ విషాదాన్ని మిగిల్చింది. కరోనా బారినపడిన ఆయన పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి ఇవాళ తెల్లవారుజామున మృతిచెందారు

న్యూఢిల్లీ: సీపీఎం ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి ఇంట్లో కరోనా వైరస్ విషాదాన్ని మిగిల్చింది. కరోనా బారినపడిన ఆయన పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి ఇవాళ తెల్లవారుజామున మృతిచెందారు. ఆశిష్‌కు రెండు వారాల క్రితం కరోనా సోకింది. దీంతో ఆయన గుర్గావ్లోని మేదాంతా దవాఖానలో చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో గురువారం ఉదయం 5.30 గంటలకు ఆయన మరణించినట్లు సీతారాం ఏచూరి ట్విట్టర్ ద్వారా తెలిపారు.
‘ఈరోజు ఉదయం నా పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి కరోనాతో చనిపోయాడని చెప్పడానికి బాధపడుతున్నాను. మాకు నమ్మకాన్ని కల్పించిన వారందరికి ధన్యవాదాలు. చికిత్స అందించిన డాక్టర్లు, నర్సులు, ఫ్రంట్‌లైన్ హెల్త్ వర్కర్లు, శానిటేషన్ సిబ్బంది, మాకు అండగా నిలిచిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని సీతారాం ఏచూరి ట్వీట్ చేశారు.
ఆశిష్ ఏచూరి న్యూఢిల్లీలో ఓ ప్రముఖ దినపత్రికలో సీనియర్ కాపీ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. రెండు వారాల క్రితం ఆయనకు కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో హోళీ ఫ్యామిలీ దవాఖానలో చేరారు. అటునుంచి ఆయనను గుర్గావ్కు తరలించారు. రెండువారాలపాటు కరోనాతో పోరాడిన ఆశిష్ ఇవాళ తుదిశ్వాస విడిచారు.
It is with great sadness that I have to inform that I lost my elder son, Ashish Yechury to COVID-19 this morning. I want to thank all those who gave us hope and who treated him – doctors, nurses, frontline health workers, sanitation workers and innumerable others who stood by us.
— Sitaram Yechury (@SitaramYechury) April 22, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
నెగెటివ్ వచ్చినా.. బయటినుంచి వస్తే క్వారంటైన్కే
కరోనాతో మాజీ మంత్రి కన్నుమూత
మీ ఇంటిని చేస్తాం.. ఐసీయూ..
రెమ్‌డెసివిర్ ఎక్కడ దొరుకుతుంది?
పాక్‌లో పేలిన కారు బాంబు.. చైనా రాయబారే లక్ష్యం
నేడు భారత్‌కు మరో నాలుగు రాఫెల్ యుద్ధ విమానాలు
దేశంలో ట్రిపుల్ మ్యుటెంట్ స్ట్రెయిన్
దేశంలో ట్రిపుల్ మ్యుటెంట్ స్ట్రెయిన్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

