Road Accident | హైదరాబాద్ : ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో కారులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాద ఘటన పటాన్చెరు ముత్తంగి వద్ద ఉన్న ఓఆర్ఆర్ ఎగ్జిట్ -3 వద్ద గురువారం ఉదయం చోటు చేసుకుంది.
ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైంది. లారీకి కూడా మంటలు వ్యాపించాయి. లారీలో ఉన్న వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి. అయితే కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు సజీవదహనం అయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
రింగ్ రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనుకనుంచి ఢీ కొట్టిన కారు
పటాన్చెరు ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్- 3 దగ్గర ఆగి ఉన్న లారీని వెనుకనుంచి ఢీ కొట్టిన కారు ఒక్కసారిగా మంటలు చెలరేగి.. కారు పూర్తిగా దగ్ధం కాగా.. మంటలు లారీకి కూడా అంటుకున్నాయి
కారులో ఇద్దరు సజీవ దహనం అయినట్టు… pic.twitter.com/1r1W9HoRhI
— Telugu Scribe (@TeluguScribe) April 25, 2024