Spider Man Brand New Day | మారుతున్న శక్తులు, కొత్త సవాళ్లు.. ఆకట్టుకుంటున్న ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ తెలుగు ట్రైలర్
Spider Man | మార్వెల్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే' చిత్రానికి సంబంధించిన అధికారిక తెలుగు ట్రైలర్ విడుదలైంది.
Spider Man | మార్వెల్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ చిత్రానికి సంబంధించిన అధికారిక తెలుగు ట్రైలర్ విడుదలైంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతుంది. టామ్ హోలండ్ హీరోగా నటిస్తున్న ఈ నాలుగవ సోలో చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ‘నో వే హోమ్’ తర్వాత పీటర్ పార్కర్ తన గుర్తింపును కోల్పోయి ఒంటరిగా మారిన తర్వాతి కథాంశంతో ఈ సినిమా సాగనుంది. న్యూయార్క్ నగరంలో పీటర్ తన కొత్త జీవితాన్ని ఎలా నెట్టుకొచ్చాడు, స్పైడర్-మ్యాన్‌గా అతను ఎదుర్కొన్న నూతన సవాళ్లు ఏమిటి అనే ఉత్కంఠభరిత అంశాలను ఈ సినిమాలో చూపించబోతున్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలో హల్క్ పాత్రలో మార్క్ రుఫాలో, పనిషర్ పాత్రలో జాన్ బెర్న్తల్ కనిపించనుండటం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. తన శక్తులలో వస్తున్న జన్యుపరమైన మార్పులను గమనిస్తూ, సొంతంగా తయారు చేసుకున్న రెడ్-అండ్-బ్లూ సూట్లో పీటర్ పార్కర్ కనిపిస్తున్న దృశ్యాలు ట్రైలర్లో హైలైట్‌గా నిలిచాయి. ఈ చిత్రం జూలై 31, 2026న తెలుగుతో పాటు పలు భారతీయ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

