నాగార్జున హీరోగా తెరకెక్కిన వైల్డ్ డాగ్ సినిమా నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చేసింది. ఏప్రిల్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈసినిమా నిరాశపర్చింది. నాగార్జున సినీకెరీర్ లోనే అత్యంత ఫ్లాప్ సినిమాగా నిలిచింది. అహిషోర్ సోలమన్ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా 6కోట్లు మాత్రమే వసూళ్లు రాబట్టింది. అలాంటి సినిమా ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో వచ్చేసింది.
దియా మిర్జా, సియామీ ఖేర్ కీలకపాత్రల్లో నటించిన ఈ యాక్షన్ డ్రామా ఫిలిమ్ మాట్నీ ఎంటర్ టైన్ మెంట్ నిర్మించింది. ఎప్పుడూ లేనిది ఈసినిమాకి నాగార్జన వీరలెవల్లో ప్రమోషన్స్ చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇండియాలోని టెర్రరిస్ట్ దాడులపై తెరకెక్కిన ఈసినిమాకి తమన్ సంగీతం అందించాడు.