వారివి మాటలు ఘనం.. చేతలు శూన్యం: మంత్రి సత్యవతి
మంత్రి సత్యవతి| ఎన్నికలు రాగానే కొన్ని పార్టీలు పెద్దపెద్ద మాటలు చెబుతాయని, తర్వాత చేసేది శూన్యమని మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. కానీ సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటమేరకు అభివృద్ధి చేసి చూపిస్తారని వెల్లడించారు.

వరంగల్: ఎన్నికలు రాగానే కొన్ని పార్టీలు పెద్దపెద్ద మాటలు చెబుతాయని, తర్వాత చేసేది శూన్యమని మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. కానీ సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటమేరకు అభివృద్ధి చేసి చూపిస్తారని వెల్లడించారు. వరంగల్‌లో పర్యటించిన సీఎం క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేసి ఏంచేస్తే బాగుంటుందని ఆలోచించి బడ్జెట్లో కార్పొరేషన్‌కు ప్రత్యేకంగా రూ.250 కోట్లు కేటాయించారని చెప్పారు. గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి గరీబ్‌నగర్‌లో ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో
చెరువు శిఖంలో పట్టాలు ఎక్కడా ఇవ్వలేదని, గరీబ్ నగర్లో మాత్రమే ఇచ్చారని, త్వరలో డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు.
సీఎం కేసీఆర్‌కు పేదల కష్టాలు తెలుసునని, అందుకే వారికి ఉపయోగపడే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. గతంలో పెన్షన్ అందుకుంటున్న వ్యక్తి చనిపోయిన తర్వాతే కొత్తవారికి పెన్షన్ ఇచ్చేవారని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితిలేదని, అర్హులందరికీ రూ.2 వేలు ఇస్తున్నారని తెలిపారు. త్వరలో లబ్ధిదారుల వయస్సును 57 ఏండ్లకు తగ్గిస్తామన్నారు. బీడీ కార్మికులు, ఒంటరి మహిళలకు కూడా పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనన్నారు.
ఆరోగ్యలక్ష్మి పథకం కింద గర్భిణిలకు నాణ్యమైన భోజనం అందిస్తున్నామని చెప్పారు. కల్యాణలక్ష్మి పథకం కింద రూ.లక్ష 116 ఇస్తున్నామన్నారు. ఇలాంటి పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
అందువల్ల పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
సీపీఎం నేత సీతారాం ఏచూరి ఇంట విషాదం..
నెగెటివ్ వచ్చినా.. బయటినుంచి వస్తే క్వారంటైన్కే
కరోనాతో మాజీ మంత్రి కన్నుమూత
మీ ఇంటిని చేస్తాం.. ఐసీయూ..
రెమ్‌డెసివిర్ ఎక్కడ దొరుకుతుంది?
పాక్‌లో పేలిన కారు బాంబు.. చైనా రాయబారే లక్ష్యం
నేడు భారత్‌కు మరో నాలుగు రాఫెల్ యుద్ధ విమానాలు
దేశంలో ట్రిపుల్ మ్యుటెంట్ స్ట్రెయిన్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

