గురువారం 03 డిసెంబర్ 2020
Rangareddy - Jul 24, 2020 , 01:09:23

కరోనా కట్టడికి సీఎం కేసీఆర్‌ కృషి

కరోనా కట్టడికి సీఎం కేసీఆర్‌ కృషి

కందుకూరు :  కరోనా కట్టడికి సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మంత్రి కేటీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా  రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ తయారు చేయించిన మూడువేల మాస్కులను గురువారం మంత్రి తన నివాసంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వంపై ప్రతి పక్షాలు చేస్తున్న ఆరోపణలు మానుకోవాలన్నారు.  మంత్రి కేటీఆర్‌ పి లుపు మేరకు సొంత ఖర్చులతో మాస్కులను తయారు చేయించిన  పాండురంగారెడ్డిని అభినందించారు. ఈ కార్యక్రమంలో తుక్కుగూడ మున్సిపల్‌ చైర్మన్‌ మధుమోహన్‌, వైస్‌ చైర్మన్‌ వెంకట్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ ఉపాధ్యక్షుడు సామ మహేందర్‌రెడ్డి, మూల హన్మంత్‌రెడ్డి, కొలను విఘ్నేశ్వర్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, జగన్‌రెడ్డి, శ్రీనివాస్‌, రాజు,శ్రీకాంత్‌గౌడ్‌, సాయికిరణ్‌, బుచ్చిరెడ్డి,రత్నం పాల్గొన్నారు.