ఆదివారం 29 నవంబర్ 2020
Peddapalli - Aug 29, 2020 , 02:23:33

మానేరు దుంకింది

మానేరు దుంకింది

  • n మరోసారి ఎల్‌ఎండీ    మూడు గేట్లు ఎత్తివేత
  • nఇన్‌ఫ్లో పెరగడంతో    3వేల క్యూసెక్కులు దిగువకు

తిమ్మాపూర్‌: గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి మోయతుమ్మెద వాగు పరవళ్లు తొక్కిం ది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌, కోహెడ మండ లం నుంచి భారీ వరదను లోయర్‌ మానేరు డ్యాం (ఎల్‌ఎండీ)లోకి మోసుకొచ్చింది. నాలుగేళ్లు తర్వాత జలాశయం నిండుకుండలా మారిం ది. డ్యాం పూర్తి సామర్ధ్యం 24.034 టీఎంసీలుకాగా, 22.5 టీఎంసీలు దాటింది. ఎగువ మోయతుమ్మెదవాగు నుంచి ఇన్‌ఫ్లో ఉండడంతో ఈ నెల 22న మంత్రి గంగుల కమలాకర్‌, కలెక్టర్‌ కే శశాంక రిజర్వాయర్‌ 9, 10, 11 గేట్లు తెరిచి, దిగువకు 6వేల క్యూసెక్కులను వదిలారు. ఇన్‌ఫ్లో తగ్గడంతో ఈ నెల 23న ఉదయం గేట్లు మూసేశారు. మళ్లీ మోయతుమ్మెద వాగు నుం చి మరోసారి భారీగా వరద రావడంతో శుక్రవారం మధ్యా హ్నం వరకు డ్యాం నీటి మట్టం 23.732 టీఎంసీలకు చేరింది. ఇంకా 9,470 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండడంతో కలెక్టర్‌ ఆదేశాల మేరకు అధికారులు అప్రమత్తమయ్యారు. మధ్యాహ్నం 3గంటల తర్వాత ఎస్సారెస్పీ చీఫ్‌ ఇంజినీర్‌ శంకర్‌ గేట్ల వద్ద పూజలు చేసి, మూడు గేట్లు (9, 10, 11) ఎత్తి 3 వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. కాకతీయ కాలువ ద్వారా దిగువన ఉన్న ఆయకట్టు కోసం, చెరువులు, కుంటలు నింపేందుకు గాను మరో 2,500 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఇక్కడ ఎస్‌ఈ శివశంకర్‌, ఈఈ శ్రీనివాస్‌, డిప్యూటీ ఈఈ సమ్మయ్య, ఏఈఈ అంజుమున్నీసా, ఏఈలు కాళిదాసు, వంశీ పాల్గొన్నారు. 

గేట్లు ఎత్తిన విషయం తెలుసుకున్న నగరవాసు లు, పరిసర గ్రామాల ప్రజలు ఎల్‌ఎండీ పరిసరాలకు చేరుకున్నారు. గేట్ల నుంచి దూకుతున్న జలాలను చూసి, సంబురపడ్డారు. సెల్ఫీలు దిగా రు. తమ సెల్‌ఫోన్లలో మానేరు అందాలను బం ధించారు. ఇటు కరీంనగర్‌ సీపీ కమలాసన్‌రెడ్డి ఆ దేశాల మేరకు ఎల్‌ఎండీ గేట్లు, రిజర్వాయర్‌ స మీపంలోకి వెళ్లకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. 

సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకే : ఎస్సారెస్పీ సీఈ శంకర్‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఎల్‌ఎండీ నుంచి దిగువకు నీటిని విడుదల చేశామని ఎస్సారెస్పీ సీఈ శంకర్‌ పేర్కొన్నారు. రిజర్వాయర్‌లో నీటిమట్టం, ఇన్‌ఫ్లోపై సీఎం ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారని తెలిపారు. రిజర్వాయర్‌లోకి 23.5 టీఎంసీలకు చేరుకోగానే దిగువకు నీటిని విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. ప్రస్తుతం 9,470 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తుందని, మూడు గేట్ల ద్వారా 3వేల క్యూసెక్కులను, కాకతీయ కాలువ ద్వారా 2500 క్యూసెక్కులను ఆయకట్టులో చెరువులు, కుంటలను నింపడానికి దిగువకు విడుదల చేస్తున్నామని తెలిపారు. ఎగువ నుంచి ఇన్‌ఫ్లో మరింత పెరిగితే మరిన్ని గేట్లు తెరుస్తామని, ఇన్‌ఫ్లో తగ్గితే గేట్లను మూసివేస్తామని వెల్లడించారు. రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.