Earthquake | మెక్సికోను భూకంపం వణికించింది. గ్వాటెమాల సరిహద్దులో బలమైన ప్రకంపనలు రికార్డయ్యాయి. రిక్టర్ స్కేల్‌పై 6.4 తీవ్రత నమోదైంది. నష్టం సంబంధించినట్లు సమాచారం అందలేదు. ఒక్కసారిగా వచ్చిన ప్రకంపనలతో జనం భయాందోళనలకు గురై ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మెక్సికోలోని సుచిట్ నగరంలో ఉదయం 6గంటలకు భూకంపం సంభవించింది. సుచియాట్ నగరం మెక్సికో-గ్వాటెమాల సరిహద్దులో ఉన్నది. సుచియాట్ నది రెండు దేశాల సరిహద్దులను వేరు చేస్తుంది.
సుచియెట్ నది సముద్రంలో కలిసే ప్రాంతంలోనే భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంపంతో ఎలాంటి నష్టం వాటిల్లినట్లు సమాచారం లేదు. అయితే, భూకంపం కారణంగా కొండ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడే అవకాశం భావిస్తున్నారు. గ్వాటెమాలాలో కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. పెద్దగా నష్టం వాటిల్లినట్లు సమాచారం లేదు. గతేడాది డిసెంబర్లో మెక్సికోలో సైతం భూకంపం సంభవించింది. ఆ సమయంలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదైంది. భూకంపం కారణంగా భవనాలు కంపించాయి. అయితే అదృష్టవశాత్తూ పెద్దగా నష్టమేమీ జరుగలేదు.