SBI Jobs | ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు గుడ్ న్యూస్.. ఎస్బీఐలో 12 వేల కొలువులు..!
SBI | ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో 12 వేల మంది ఫ్రెషర్లను నియమించుకుంటామని ఎస్బీఐ తెలిపింది.
SBI Jobs | ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) తీపి కబురందించింది. ఐటీ రంగంలో నియామకాలు నెమ్మదించిన టైంలో ఫ్రెషర్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఎస్బీఐ ప్రత్యామ్నాయం చూపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో 12 వేల మంది ఫ్రెషర్లను నియమించుకుంటామని తెలిపింది. ఇందులో 85 శాతం మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు అవకాశం కల్పిస్తామని ఎస్బీఐ చైర్మన్ దినేశ్ ఖర్రా చెప్పారు. 3000 మంది ప్రాజెక్టు ఆఫీసర్లు, 8,000 మంది అసోసియేట్లకు బ్యాంకింగ్ వ్యవహారాల్లో ట్రైనింగ్ ఇచ్చి.. అటుపై వివిధ వ్యాపార విభాగాల్లో నియమిస్తామన్నారు.
గతంతో పోలిస్తే బ్యాంకింగ్ రంగం టెక్నాలజీపై ఆధార పడటం పెరిగిందని దినేష్ ఖర్రా తెలిపారు. టెక్నాలజీ ఆధారంగా ఖాతాదారులకు కొత్తగా ఏ విధంగా సేవలందించాలన్న విషయమై ద్రుష్టి సారించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఈ విషయమై కొన్ని బ్యాంకులు సవాళ్లు ఎదుర్కొంటున్న సంగతి గుర్తు చేశారు. శిక్షణ పొందిన వారి అర్హతలు, ప్రతిభ ఆధారంగా వివిధ వ్యాపార, ఐటీ రంగ బాధ్యతలు అప్పగిస్తామని తెలిపారు. అప్పుడే బ్యాంకింగ్ రంగానికి తగిన రీతిలో టెక్ మ్యాన్ పవర్ అందించగలం అని అన్నారు.
ఎస్బీఐ సిబ్బంది ఇన్‌హౌస్ ఇన్స్టిట్యూట్లో టెక్నాలజీపై శిక్షణ ఇవ్వడానికి భారీ మొత్తంలోనే ఖర్చవుతున్నదని దినేశ్ ఖర్రా చెప్పారు. ప్రతి ఉద్యోగీ టెక్నాలజీని అంది పుచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పుడు అత్యధికంగా టెక్నాలజీ ఆధారంగా బ్యాంకింగ్ లావాదేవీలు జరుగుతున్న సంగతిని ఎవరూ విస్మరించలేరన్నారు. ఈ విషయమై బ్యాంకింగ్ నియంత్రణ సంస్థ ‘ఆర్బీఐ’ కూడా తగిన మార్గదర్శకాలు జారీ చేసిందని చెప్పారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

