ఎస్బీఐలో 5 వేల క్లర్క్ పోస్టులు.. దరఖాస్తులు ప్రారంభం
క్లర్క్ పోస్టులు| దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వివిధ బ్రాంచీల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది.

న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వివిధ బ్రాంచీల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చే నెల 17 అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 5 వేల ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో కర్క్ పోస్టులతోపాటు క్లరికల్ క్యాడర్లో జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులకు స్థానిక భాష తెలిసి ఉండాలి.
అర్హతలు: ఏదైనా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. అభ్యర్థులు 20 నుంచి 28 ఏండ్ల మధ్య వయస్సు లేదా 1993, ఏప్రిల్ 2 నుంచి 2021, ఏప్రిల్ 1 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ రాతపరీక్ష. పరీక్ష ప్రిలిమినరీ, మెయిన్స్ అని రెండు విభాగాలుగా ఉంటుంది.
పరీక్ష విధానం
ప్రిలిమినరీ.. మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ప్రశ్నలు అన్ని ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. నిర్ణీత సమయంలోపు సెక్షన్‌ను పూర్తిచేయాల్సి ఉంటుంది. ఇందులో ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి 30 ప్రశ్నలు ఇస్తారు. మొత్తం 30 మార్కులకు ఉంటుంది. న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ నుంచి 35 ప్రశ్నల చొప్పున ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 70 మార్కులు ఉంటాయి. మూడు విభాగాలకు 20 నిమిషాల చొప్పున మొత్తం గంట సేపట్లో పరీక్ష రాయాలి. ప్రతి తప్పు సమాధానానికి పావు మార్కు కోత విధిస్తారు.
మెయిన్.. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించినవారు మెయిన్స్ పరీక్ష రాయవచ్చు. ఇందులో మొత్తం 190 ప్రశ్నలు అడుగుతారు. వాటికి 200 మార్కులు కేటాయించారు. పరీక్షను 2.40 గంటల సమయంలో పూర్తిచేయాలి. జనరల్ లేదా ఫైనాన్షియల్ అవేర్నెస్ (50 మార్కులు, 50 ప్రశ్నలు), జనరల్ ఇంగ్లిష్ (40 మార్కులు, 40 ప్రశ్నలు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (50 మార్కులు, 50 ప్రశ్నలు), రీజనింగ్ ఎబిలిటీ, కంప్యూటర్ ఆప్టిట్యూడ్ (50 ప్రశ్నలు, 60 మార్కులు) నుంచి ప్రశ్నలు అడుగుతారు.
అప్లికేషన్ విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులు ప్రారంభం: ఏప్రిల్ 27
దరఖాస్తులకు చివరితేదీ: మే 17
ప్రిలిమినరీ పరీక్ష: జూన్ లో
మెయిన్ ఎగ్జామ్: జూలై 31
వెబ్సైట్: https://www.sbi.co.in/careers
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ఐఐఎస్ఆర్ తిరుపతిలో పీహెచ్డీ ప్రవేశాలు
ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్
ఆస్పత్రిలో గొడవ.. డాక్టర్‌ను చెంపదెబ్బ కొట్టిన నర్సు, నర్సుపై డాక్టర్ దాడి.. వీడియో
ఝూఠగాళ్లతో జాగ్రత్తగా ఉండాలి : మంత్రి హరీష్ రావు
ఊపిరులూదినా.. ప్రాణం నిలువలే!
భారత్‌కు మే 1న ‘స్పుత్నిక్-వీ’ మొదటి బ్యాచ్ : ఆర్డీఐఎఫ్
ఇంటికి ఎవర్నీ రానివ్వొద్దు!
ఇండియా నుంచి వచ్చే విమానాలపై ఆస్ట్రేలియా నిషేధం
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

