ఇండియాకు అండగా 40 టాప్ అమెరికన్ కంపెనీల సీఈవోల టాస్క్‌ఫోర్స్

వాషింగ్టన్: కష్టకాలంలో ఇండియాకు అండగా నిలవడానికి ప్రపంచమే తరలి వస్తోంది. తాజాగా అమెరికాకు చెందిన 40 టాప్ కంపెనీల సీఈవో ఏకమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకంగా ఓ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసి మరీ ఇండియాకు సాయం చేయడానికి సిద్ధమయ్యారు. యూఎస్ చాంబర్స్ ఆఫ్ కామర్స్‌కు చెందిన యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్, యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ అండ్ పార్ట్నర్షిప్ ఫోరమ్, బిజినెస్ రౌండ్‌టేబుల్ ఈ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటులో కీలకపాత్ర పోషించాయి. సోమవారం దీనికోసమే ప్రత్యేకంగా సమావేశమై రానున్న వారాల్లో ఇండియాకు 20 వేల ఆక్సిజన్ కాన్సెన్ట్రేటర్లను ఇవ్వాలని నిర్ణయించినట్లు డెలాయిట్ సీఈవో పునీత్ రెంజెన్ వెల్లడించారు.
ఈ టాస్క్‌ఫోర్స్ ఇండియాకు అత్యవసరమైన వైద్య పరికరాలు, వ్యాక్సిన్లు, ఆక్సిజన్, ఇతర సాయం చేయనుంది. ఈ యూఎస్ పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఏర్పాటైన దీనికి గ్లోబల్ టాస్క్‌ఫోర్స్ ఆన్ పాండెమిక్ రెస్పాన్స్: మొబిలైజింగ్ ఫర్ ఇండియా అనే పేరు పెట్టారు. మరో దేశంలో నెలకొన్న ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు కావడం ఇదే తొలిసారి అని అమెరికా విదేశాంగ మంత్రి టోనీ బ్లింకెన్ ట్వీట్ చేశారు.
అమెరికాలోని ప్రైవేట్ సెక్టార్ ఇండియాలో ఏర్పడిన కొవిడ్-19 సంక్షోభానికి ఎలాంటి పరిష్కారం చూపించగలదో ఇది నిరూపిస్తోందని బ్లింకెన్ అభిప్రాయపడ్డారు. ఇండియాకు సాయం చేయడానికి చాలా అమెరికా కంపెనీలు ముందుకు వచ్చాయని డెలాయిట్ సీఈవో రెంజెన్ చెప్పారు. తమకు సాధ్యమైనంత సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇండియాలో ప్రస్తుతం ఆక్సిజన్ కొరత ఉన్న కారణంగా మొదట వాటినే సరఫరా చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
ఈ వారం మధ్యలోనే ఇండియాకు వెయ్యి ఆక్సిజన్ కాన్సెన్ట్రేటర్లు రానున్నాయని, మే 5 వరకు మరో 11 వేలు పంపిస్తామని రెంజెన్ తెలిపారు. ఇక ఇండియా ప్రధాని, అమెరికా అధ్యక్షుడి మధ్య జరిగిన ఫోన్ సంభాషణను కూడా ఆయన స్వాగతించారు. రెండు దేశాలు సహజ మిత్రులని ఆయన అన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Uttar Pradesh | యూపీలో మంటల్లో చిక్కుకున్న కారు.. చిన్నారి సహా ఆరుగురు సజీవదహనం
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సూపర్ స్ట్రయికర్.. కొత్త కారు అందుకున్న వైభవ్ సూర్యవంశీ
Sharwanand | శర్వానంద్ ‘భోగి’ మళ్లీ వాయిదా పడనుందా .. ఇంకా క్లారిటీ ఇవ్వని మేకర్స్!
Gas cylinder | మేడ్చల్‌లో పేలిన గ్యాస్ సిలిండర్ .. తృటి తప్పిన పెను ప్రమాదం
Katrina Kaif | దీపావళికి కత్రినా కైఫ్ స్పెషల్ గిఫ్ట్.. తొలిసారి కొడుకు విహాన్ ఫొటో షేర్ చేసిన స్టార్ కపుల్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

