ఐఐఎస్ఆర్ తిరుపతిలో పీహెచ్డీ ప్రవేశాలు
ఐఐఎస్ఆర్| ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఐఐఎస్ఆర్) వచ్చే విద్యాసంవత్సరానికిగాను వివిధ కోర్సుల్లో పీహెచ్డీ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలయింది.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఐఐఎస్ఆర్) వచ్చే విద్యాసంవత్సరానికిగాను వివిధ కోర్సుల్లో పీహెచ్డీ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలయింది. అర్హులైన అభ్యర్థుల ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దరఖాస్తులు వచ్చేనెల 23 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపికచేయనుంది. కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ, మ్యాథ్స్, ఎర్త్‌సైన్సెస్‌లో పీహెచ్డీ ప్రవేశాలు కల్పించనుంది.
అర్హత: డిగ్రీ 50 శాతం మార్కులతో పాసై ఉండాలి. అందేవిధంగా సీఎస్ఐఆర్ లేదా యూజీసీ నెట్, ఇన్స్పైర్ పీహెచ్డీ ఫెలోషిప్స్లో అర్హత సాధించాలి. అభ్యర్థులు 28 ఏండ్లలోపువారై ఉండాలి.
ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ
సబ్జెక్టులు: బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్
అర్హత: డిగ్రీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత జేజీఈఈఐఎల్ఎస్/జామ్-2021 లేదా జస్ట్ అర్హత సాధించి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా. దరఖాస్తుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తారు.
దరఖాస్తు: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరి తేదీ: మే 23
ఇంటర్వ్యూ తేదీ: జూన్ 11 నుంచి 25 మధ్య
ఫలితాలు: జూన్ 26-జూలై 5 మధ్య
పీహెచ్‌డీలో ప్రవేశాలు: ఆగస్టు 2
వెబ్సైట్: http://www.iisertirupati.ac.in/admissions/phd
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

