ప్లాస్టిక్ వ్యర్థాలతో ప్రొటీన్ కుకీలు!
ప్లాస్టిక్ వ్యర్థాలతో నాసా అధిక ప్రొటీన్ కలిగిన కుకీలను తయారు చేసింది. నాసా చేపట్టిన ‘డీప్ స్పేస్ ఫుడ్ చాలెంజ్' ఆర్థిక సహాయంతో సౌథర్న్ ఇల్లినాయిస్ యూనివర్సిటీ కార్బొండేల్ పరిశోధకులు మైక్రోబైట్స్ పేరుతో 3డీ-ప్రింటెడ్, అధిక ప్రొటీన్ కలిగిన కుకీలను అభివృద్ధి చేస్తున్నారు. డీప్ స్పేస్ ఫుడ్ చాలెంజ్ ప్రాజెక్టు భవిష్యత్తు అంతరిక్ష ప్రయోగాలకు తోడ్పడటంతోపాటు చెత్త, ఆహార కొరత సమస్యలకు కొత్త పరిష్కారాలను అన్వేషిస్తున్నది.
- నాసా మద్దతుతో శాస్త్రవేత్తల ప్రయోగం
- 3డీ ప్రింటెడ్ మైక్రోబైట్స్ తయారీ
న్యూఢిల్లీ: ప్లాస్టిక్ వ్యర్థాలతో నాసా అధిక ప్రొటీన్ కలిగిన కుకీలను తయారు చేసింది. నాసా చేపట్టిన ‘డీప్ స్పేస్ ఫుడ్ చాలెంజ్’ ఆర్థిక సహాయంతో సౌథర్న్ ఇల్లినాయిస్ యూనివర్సిటీ కార్బొండేల్ పరిశోధకులు మైక్రోబైట్స్ పేరుతో 3డీ-ప్రింటెడ్, అధిక ప్రొటీన్ కలిగిన కుకీలను అభివృద్ధి చేస్తున్నారు. డీప్ స్పేస్ ఫుడ్ చాలెంజ్ ప్రాజెక్టు భవిష్యత్తు అంతరిక్ష ప్రయోగాలకు తోడ్పడటంతోపాటు చెత్త, ఆహార కొరత సమస్యలకు కొత్త పరిష్కారాలను అన్వేషిస్తున్నది. ఈ కుకీలు తినడానికి సురక్షితమేనని పరిశోధకులు చెప్తున్నప్పటికీ వీటి రుచిని పరీక్షించడానికి ఇంకా సంబంధిత సంస్థల నుంచి అనుమతులు రావాల్సి ఉన్నది.
మైక్రోబైట్స్ అనేవి వ్యర్థ పదార్థాల నుంచి ప్రొటీన్, ఇతర పోషకాలు అందించేలా రూపొందించిన 3డీ ప్రింటెడ్ కుకీలు. సౌథర్న్ ఇల్లినాయిస్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ లాహిరు జయకోడి నేతృత్వంలోని పరిశోధక బృందం మనం సాధారణంగా వాడే నీళ్ల సీసాలు, కూల్‌డ్రింక్ బాటిళ్లలో ఉండే పెట్(పాలిథిలీన్ టెరెప్తలేట్) రకం ప్లాస్టిక్‌ను దీనికోసం ఉపయోగిస్తున్నది. దీంతోపాటు పారేసే మక్కజొన్న దంట్లు, ఆకులు, ఇతర వ్యవసాయ వ్యర్థాలను కూడా ఈ ప్రక్రియలో వాడుతున్నారు. పరిశోధకులు ప్లాస్టిక్‌ను కేవలం పొడిగా నూరి పిండిలో కలపరు. వ్యర్థాలను విచ్ఛిత్తి చేసి, సూక్ష్మజీవులు వాటిని ఆహార పదార్థాలుగా మార్చేలా ఒక ప్రత్యేకమైన ప్రక్రియను ఉపయోగిస్తారు.
తయారీలో మూడు ముఖ్యమైన దశలు
ప్లాస్టిక్, వ్యవసాయ వ్యర్థాల విచ్ఛిత్తి: పరిశోధకులు ముందుగా ఆక్సిడేటివ్ హైడ్రోథర్మల్ డిజల్యూషన్ అనే సాంకేతికతను ఉపయోగిస్తారు. ఇది నీరు, ఆక్సిజన్, అధిక ఉష్ణోగ్రత, తీవ్రమైన ఒత్తిడిని ఉపయోగించి కఠినమైన వ్యర్థాలను సూక్ష్మజీవులు జీర్ణించుకోగలిగే చిన్న భాగాలుగా విడగొడుతుంది.
ప్రత్యేకంగా తయారు చేసిన ఈస్ట్: విచ్ఛిత్తి చేసిన పదార్థాలను జన్యుమార్పిడి లేదా ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈస్ట్ రకాలకు ఆహారంగా అందిస్తారు. ఈ సూక్ష్మజీవులు ఆ పదార్థాలను ప్రొటీన్లు, ఇతర పోషకాలతో కూడిన కొత్త కాంపౌండ్స్‌గా మారుస్తాయి. సూక్ష్మజీవుల ద్వారా విటమిన్లు, రుచులు వంటి అదనపు పదార్థాలను కూడా తయారుచేసే మార్గాలను పరిశోధకులు అన్వేషిస్తున్నారు.
కుకీల ప్రింటింగ్: ఈ ప్రక్రియ ద్వారా వచ్చిన మిశ్రమాన్ని పీచు పదార్థం(ఫైబర్), పిండి పదార్థం, తీపి పదార్థాలతో కలుపుతారు. తర్వాత దీనిని 3డీ ప్రింటర్ ద్వారా కుకీలుగా ముద్రిస్తారు.
అయితే, ఈ ప్రక్రియ ఇంకా పరిశోధన దశలోనే ఉన్నది. ఈ సాంకేతికత అందుబాటులోకి వచ్చినంత మాత్రాన ప్లాస్టిక్‌ను నేరుగా సురక్షితంగా తినలేం. ప్లాస్టిక్ ముందుగా నియంత్రిత పద్థతిలో ప్రాసెసింగ్‌కు గురికావాలి. అలాగే తయారుచేసిన ఆహార పదార్థాలు కఠినమైన ఆహార భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

