వెలుగుల ప్రస్థానం చీకట్లలోకి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు తీవ్రమైన విద్యుత్తు కొరతను ఎదుర్కొన్నది. వ్యవసాయానికి రోజుకు సుమారు ఆరు గంటల విద్యుత్తును రెండు విడతల్లో సరఫరా అయ్యేది. పరిశ్రమలకు వారానికి రెండు రోజుల విద్యుత్తు సెలవులు ఉండేవి. గృహ వినియోగదారులు కూడా విద్యుత్తు కోతలను ఎదుర్కొనేవారు. రైతులు రాత్రిపూట పొలాల్లో కరెంటు కోసం పడిగాపులు కాసేవారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు తీవ్రమైన విద్యుత్తు కొరతను ఎదుర్కొన్నది. వ్యవసాయానికి రోజుకు సుమారు ఆరు గంటల విద్యుత్తును రెండు విడతల్లో సరఫరా అయ్యేది. పరిశ్రమలకు వారానికి రెండు రోజుల విద్యుత్తు సెలవులు ఉండేవి. గృహ వినియోగదారులు కూడా విద్యుత్తు కోతలను ఎదుర్కొనేవారు. రైతులు రాత్రిపూట పొలాల్లో కరెంటు కోసం పడిగాపులు కాసేవారు. తక్కువ ఓల్టేజీతో మోటార్లు కాలిపోవడం, ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినడం, నీరు అందక పంటలు ఎండిపోవడం వంటి సమస్యలు చాలా ప్రాంతాల్లో కనిపించేవి. పరిశ్రమల్లో ఉత్పత్తి నిలిచిపోయేది. డీజిల్ జనరేటర్లపై ఆధారపడటంతో ఖర్చులు పెరిగి, ఉపాధి అవకాశాలు దెబ్బతినేవి. కానీ విద్యుత్తు రంగ సమస్యలన్నింటినీ కేసీఆర్ సర్కార్ పరిష్కరించింది. కానీ నేడు కాంగ్రెస్, తెలుగుదేశం పాలించిన ‘ఆనాటి రోజులు’ మళ్లీ వచ్చాయి.
సమైక్య రాష్ట్రంలో విద్యుత్తురంగంలో తెలంగాణ అరిగో పడ్డది. చంద్రబాబు పాలనలో విద్యుత్తు ఛార్జీల పెంపు రైతులను తీవ్ర సంక్షోభంలోకి నెట్టిది. సర్కార్ విద్యుత్తు విధానాలకు వ్యతిరేకంగా రైతుల పోరాటం ఉవ్వెత్తున సాగింది. 2000 ఆగస్టు 28న హైదరాబాద్ బషీర్‌బాగ్‌లో చంద్రబాబు సర్కార్ కర్కషంగా కాల్పులు జరిపింది. ఆ ఘటనలో ముగ్గురు మరణించగా, దాదాపు 200 మంది గాయపడ్డారు. సమైక్య రాష్ట్రంలో విద్యుత్తు సమస్యలు తెలంగాణ ప్రజల జీవితాలను ఎంతగా పట్టిపీడించాయో తెలిపేందుకు ఈ ఘటన నిదర్శనం. ఆ కాల్పులను నిరసిస్తూ నాటి డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న కేసీఆర్, చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. ఆ తర్వాత ఉద్యమ బాటపట్టారు.
కేసీఆర్ పాలనలో విద్యుత్తు రంగ విస్తరణ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం కరెంటు కొరతను అధిగమించేందుకు ప్రత్యేక ప్రణాళికలను అమలు చేసింది. విద్యుత్తు కొనుగోళ్లు, ఉత్పత్తి సామర్థ్యం పెంపు, థర్మల్ విద్యుత్తు కేంద్రాల నిర్మాణం, సౌర విద్యుత్తు విస్తరణ, ట్రాన్స్మిషన్, పంపిణీ వ్యవస్థల బలోపేతంపై దృష్టి పెట్టింది. కేసీఆర్ ప్రగతిభవన్‌లో తాను కూర్చునే కుర్చీ ఎదురుగా విద్యుత్తుకు సంబంధించిన వివరాలను స్క్రీన్‌పై చూస్తూ, అధికారులతో మాట్లాడుతూ సూచనలు చేసేవారు. నాణ్యమైన విద్యుత్తును నిరంతరం అందించడం కోసం సమీక్షలు నిర్వహించేవారు. అలాంటి విజన్‌తోనే తెలంగాణను వెలుగులు విరజిమ్మే రాష్ట్రంగా తీర్చిదిద్దారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు 24 గంటలు సరఫరా చేశారు. పరిశ్రమలకు విద్యుత్తు సెలవులు తొలగించారు. తెలంగాణ విద్యుత్తు విధానంలో రైతులకు భరోసా, పరిశ్రమలు, ఐటీ సంస్థలు, పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించడం ముఖ్యమైన అంశాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే చీకటి కాలం వస్తుందని గతంలో చెప్పిన నాయకులే, విద్యుత్తు రంగంలో సాధించిన పురోగతిని గుర్తించి పొగిడిన సందర్భాలూ చూశాం. కేసీఆర్ పాలనలో రాష్ట్ర ఆదాయం పెరగడంతోపాటు ప్రజల తలసరి ఆదాయంలో గణనీయ పురోగతికి విద్యుత్తు కీలకంగా నిలిచింది.
యాదాద్రి థర్మల్ ప్లాంట్ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ తెలంగాణ విద్యుత్తు భద్రతకు కీలకం. ఈ ప్లాంటుకు అవసరమైన బొగ్గు నాణ్యత, పరిమాణం, రవాణా, నిల్వలపై ముందస్తు ప్రణాళిక అత్యవసరం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. అవసరమైన బొగ్గు నిల్వలను సమకూర్చుకోలేదు. ఈ నెల 16 నాటి వార్తా కథనాల ప్రకారం, రాష్ట్రలోని థర్మల్ విద్యుత్తు కేంద్రాల వద్ద 6.41 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు మాత్ర మే ఉండగా, రోజువారీ వినియోగం సుమారు 74,800 టన్నులుగా ఉన్నది.
ఈ నిల్వలు సుమారు 9 రోజులకు సరిపోతాయని, యాదా ద్రి ప్లాంటు వద్ద ఐదు రోజులకు సరిపడా నిల్వలే ఉన్నట్టు తెలుస్తున్నది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ నిబంధనల ప్రకారం కనీసం 21 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉంచుకోవాల్సిన భాధ్య త ఉత్పత్తి సంస్థలపై ఉన్నది. అలా లేకపోవడం ప్రభుత్వ వైఫల్యమే. సింగరేణి బొగ్గు ఉత్పత్తి, నాణ్యత, రవాణా, నిల్వల నిర్వహణ రా ష్ట్ర విద్యుత్తు భద్రతకు కీలకం. కానీ నిల్వలు తగ్గిన తర్వాత సమీక్షలు నిర్వహించడం ఏంటి? రైతు లు, ప్రజలపై సోయిలేని ప్రభుత్వ నిర్వాకమిది.
విదేశీ బొగ్గు దిగుమతి వివాదం
విదేశీ బొగ్గు దిగుమతి ఏర్పాట్లపై స్వతంత్ర విచారణ జరిపించాలని, ఒప్పందాలు, ధరలు, టెండర్లు, ప్రైవేట్ లాజిస్టిక్స్ సంస్థల పాత్రను వెల్లడించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో విచారణకు ఆదేశిస్తే అన్ని ఆధారాలు అందజేస్తామని చెప్పారు. విదేశీ బొగ్గు కొనుగోలు చేయడం కంటే ముందు, దేశీయ బొగ్గు లభ్యత ఎంత? దిగుమతులు ఎందుకు అవసరమయ్యాయి? కొనుగోలు ధరలు ఎలా నిర్ణయించారు? రవాణా ఖర్చు ఎంత? అనే వివరాలను ప్రభుత్వం వెల్లడించాలి.
రైతులకు విద్యుత్తు కష్టాలు ఎందుకు?
రెండు నెలలుగా విద్యుత్తు అంతరాయాలపై రైతులు నిరసనలు తెలుపుతున్నారు. కానీ సంక్షో భం వచ్చిన తర్వాత సీఎం అధికారుకు ఆదేశాలు ఇవ్వడం నిర్లక్ష్యమే. ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని తొమ్మిది నెలలుగా వాతావరణ, నీటిపారుదల నిపుణులు చెప్తూ వస్తున్నారు. ఆ హెచ్చరికలను ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. కాళేశ్వరం నీళ్లు ఎత్తాలని సూచించిన రిరైర్డ్ ఇంజీనీర్లకు బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలని వ్యాఖ్యానించడం రేవంత్ తెలివితక్కువతనానికి నిదర్శనం. ఎన్నో వి ద్యుత్తు సంస్కరణలు తెచ్చిన ఘనత కేసీఆర్‌ది అయితే, వాటిని నిలబెట్టలేని చేతకాని పాలన రేవంత్‌రెడ్డిది.
సంక్షోభ పరిష్కారానికి ఏం చేయాలి?
హైదరాబాద్ సహా తెలంగాణలో డాటా సెంటర్లు, కృత్రిమ మేధస్సు మౌలిక సదుపాయాలు, సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు పెట్టుబడులను ఆకర్షించడం అభివృద్ధికి ఉపయోగకరం. కానీ కొత్త పరిశ్రమలు వస్తే ఎంత విద్యుత్తు అవసరం? ఎక్కడి నుంచి సరఫరా చేస్తారు? అదనపు సామర్థ్యానికి అయ్యే ఖర్చును ఎవరు భరిస్తారు? రైతులు, గృహ వినియోగదారులు, ఇప్పటికే ఉన్న పరిశ్రమల సరఫరాపై ప్రభావం ఏమిటి? అనే అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి.
ప్రస్తుత ప్రభుత్వం విద్యుత్తు రంగంపై శ్వేతపత్రం విడుదల చేసి, 2024 నుంచి ఇప్పటివరకు డిమాండ్ ఉత్పత్తి, కొనుగోళ్లు, బొగ్గు నిల్వలు, నిలిచిపోయిన యూనిట్లు, రైతులకు సరఫరా వివరాలను వెల్లడించాలి. సింగరేణి బొగ్గు ఉత్పత్తిని బలోపేతం చేయాలి. అవసరమైన నాణ్యతతో బొగ్గు అందుబాటులో ఉంచాలి. థర్మల్ ప్లాంట్లను వాటి సామర్థ్యానికి అనుగుణంగా సక్రమంగా నడపాలి. నాణ్యమైన బొగ్గును ఉపయోగించి, నిర్వహణ లోపాలను సరిదిద్ది, బొగ్గు రవాణా, నిల్వలపై ముందస్తు ప్రణాళిక రూపొందించాలి. అవసరమైతే ప్రత్యామ్నాయ విద్యుత్తు కొనుగోళ్లను పారదర్శకంగా చేపట్టాలి. సౌర విద్యుత్తుతోపాటు థర్మల్, జల విద్యుత్తు, నిల్వ వ్యవస్థలను సమన్వయం చేయాలి. బొగ్గు నిల్వలు ఎందుకు తగ్గాయి, ప్లాంట్లు ఎందుకు నిలిచిపోయాయి, రైతులకు అంతరాయాలు ఎందుకు వస్తున్నాయి అనే అంశాలపై మూలకారణాలను గుర్తించి బాధ్యతను నిర్ధారించాలి.
(వ్యాసకర్త: టీఎస్ఈఆర్సీ మాజీ చైర్మన్)
తన్నీరు శ్రీరంగారావు
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

